క్రీడాభూమి

అది యువ షూటర్లకు విఘాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: బర్మింగ్‌హామ్‌లో 2022 సంవత్సరంలో నిర్వహించే కామనె్వల్త్ గేమ్స్‌లో షూటింగ్ అంశాన్ని చేర్చకపోవడం యువ షూటర్లకు అతి పెద్ద విఘాతం కలిగిస్తుందని ప్రముఖ షూటర్ జితూ రాయ్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో ఇటీవల జరిగిన కామనె్వల్త్ గేమ్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 235.1తో రికార్డు సృష్టించడంతోపాటు మన దేశానికి అత్యధిక పతకాలు అందించేందుకు దోహదపడిన వారిలో ఒకడైన జితూ రాయ్ రానున్న కామనె్వల్త్ గేమ్స్‌లో షూటింగ్ విభాగాన్ని చేర్చకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. గోల్డ్ కోస్ట్ కామనె్వల్త్ గేమ్స్‌లో తమ బృందం సభ్యులు ఎన్నో పతకాలు సాధించారని, ఈ ఘనత సాధించిన యువత రానున్న రోజుల్లో మరిన్ని పతకాలు మన దేశానికి అందించే అవకాశం ఉందని ఆయన ఇక్కడ పీటీఐతో మాట్లాడుతూ అన్నాడు. షూటింగ్‌లో ఎన్నో రికార్డులను యువ ఆటగాళ్లు సవరిస్తున్న నేపథ్యంలో బర్మింగ్‌హామ్ కామనె్వల్త్ గేమ్స్‌లో షూటింగ్ విభాగాన్ని చేర్చకపోవడం శోచనీయమని ఆయన వ్యాఖ్యానించాడు. ఇండియన్ ఆర్మీ బుధవారం ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న జితూ రాయ్ మాట్లాడుతూ ‘మా విద్యుక్త ధర్మం షూటింగ్‌పై దృష్టిని కేంద్రీకరించడమే. ఇక ఈ విభాగాన్ని కామనె్వల్త్ గేమ్స్‌లో చేరుస్తారా? లేదా? అన్న విషయం మన చేతుల్లో ఏమీ లేదు. ఇది ప్రభుత్వ (నిర్వాహకుల) ఆధీనంలో ఉంది. షూటింగ్ విభాగాన్ని తప్పకుండా చేరుస్తారనే నమ్మకం నాకు ఇప్పటికీ ఉంది’ అని ఆయన పేర్కొన్నాడు. గోల్డ్ కోస్ట్‌లో పాల్గొని పలు పతకాలతో స్వదేశానికి తిరిగి వచ్చిన క్రీడాకారులకు ఇండియన్ ఆర్మీ అధికారులు ఘన స్వాగతం పలికారు.
రియో ఒలింపిక్స్‌లో పతకాన్ని చేజార్చుకుని నిరాశపడిన జితూ రాయ్ ఆ తర్వాత గట్టి పట్టుదల, కృషితో గోల్డ్ కోస్ట్ కామనె్వల్త్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో చాలా సంతోషం ఉన్నాడు. గడిచిన పోటీలో జరిగిన ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని దూసుకుపోతున్న రాయ్ తన తదుపరి లక్ష్యాలైన వరల్డ్ చాంపియన్‌షిప్, ఆసియన్ గేమ్స్‌పై దృష్టి సారించాడు. ఈనెల 20 నుంచి 30 వరకు కొరియాలోని చాంగ్‌వన్‌లో జరిగే వరల్డ్ కప్‌లో పాల్గొనేందుకు తయారవుతున్నట్టు ఆయన వెల్లడించాడు.