క్రీడాభూమి

స్పెషల్ ట్రైన్‌లో పుణేకు సీఎస్‌కే అభిమానులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఏప్రిల్ 19: తమిళనాడులో రాజుకున్న కావేరి జలాల తరలింపు వివాదం కారణంగా చెన్నైలో జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్‌లను పుణెకు తరలించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. రెండేళ్ల నిషేధం తర్వాత సొంతగడ్డపై చెన్నై ఆడుతుంటే చూడాలని అభిమానులు ఎంతో ఆశతో ఎదురుచూశారు. కానీ ఇక్కడ జరగాల్సిన మిగిలిన మ్యాచ్‌లన్నీ పుణెకు తరలించడంతో వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే, పుణెను సొంతగడ్డగా భావించి మ్యాచ్‌లు అడుతున్న తమ జట్టుకు మద్దతు పలకాలనుకున్న అభిమానుల కోరికను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఫ్రాంచైజీల దృష్టికి తీసుకెళ్లింది. సీఎస్‌కే జట్టు అందుకు సానుకూలంగా స్పందించి, చెన్నై నుంచి పుణెకు ప్రత్యేక రైలుకు అనుమతి ఇవ్వాలని కోరింది. ఈ ప్రతిపాదనకు ఆంగీకారం తెలిపిన రైల్వే ప్రత్యేక రైలును చెన్నై నుంచి పుణెకు గురువారం ఉదయం బయలుదేరింది. ఈ ట్రెయిన్‌లో దాదాపు వెయ్యి మంది అభిమానులు బయలుదేరి వెళ్లారు. పసుపురంగు జెర్సీలు, పసుపుపచ్చ జెండాలతో ట్రెయిన్ మొత్తం పసుపుమయమైంది. సీఎస్‌కే.. సీఎస్‌కే అంటూ అభిమానులు చేసే నినాదాలతో మార్మోగిపోయింది.