క్రీడాభూమి

మనీకా రూపంలో స్టార్ క్రీడాకారిణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: దాదాపు పదేళ్లుగా ఇండియన్ టేబుల్ టెన్నిస్‌ను తన భుజస్కంధాలపై మోస్తున్న తనకు మనీకా భాత్రా రూపంలో కొత్త స్టార్ క్రీడాకారిణి దొరికిందని, దీంతో తనపై చాలావరకు భారం తగ్గినట్టు ఫీలవుతున్నానని భారత సీనియర్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు శరత్ కమల్ వ్యాఖ్యానించాడు. ఇటీవల గోల్డ్ కోస్ట్‌లో జరిగిన కామనె్వల్త్ గేమ్స్‌లో ఈ మనీకా భాత్రా నాలుగు పతకాలు సాధించిందని, వాటిలో టీమ్ ఈవెంట్‌లో రెండు గోల్డ్ పతకాలు, సింగిల్స్‌లో మరో రెండు పతకాలు సాధించి ఇంతవరకు ఎవరూ సాధించని ఘనతను తన ఖాతాలో వేసుకుందని ఆయన అన్నాడు. తాను తొలినుంచి ఊహించినట్టే మనీకా భాత్రా గొప్ప విజయాలను నమోదు చేసిందని, కామనె్వల్త్ గేమ్స్‌లో కనీసం మూడు పతకాలు సాధించినా మరో నాలుగేళ్లవరకు ఆ సంతృప్తి ఉంటుందని, కానీ నాలుగు పతకాలు సాధించడం గొప్ప విషయమని ఆయన అన్నాడు. కామనె్వల్త్ గేమ్స్ జరుగుతున్న సమయంలో ఎంతోమంది అంతర్జాతీయ కోచ్‌లు, ఆటగాళ్లను తాను కలుసుకున్నానని, బర్మింగ్‌హామ్‌లో 2022లో జరిగే కామనె్వల్త్ గేమ్స్ వరకు తాను ఈ ఆడతానని వారితో చెప్పినట్టు ఆయన తెలిపాడు.