క్రీడాభూమి

భారత హాకీ జట్టు ప్రాబబుల్స్‌కు 61 మంది ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: మహిళల జట్టును మరింత పటిష్టం చేసేందుకు భారత హాకీ సమాఖ్య ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా సీనియర్ మహిళల జాతీయ స్థాయి హాకీ శిక్షణ శిబిరాన్ని ఈనెల 22 నుంచి బెంగళూరులోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) సెంటర్‌లో నిర్వహించనుంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా 61 మంది క్రీడాకారిణులను ఎంపిక చేసింది. వీరిలో 18 మంది ఇటీవల కామనె్వల్త్ క్రీడల్లో పాల్గొన్న వారు ఉండటం విశేషం. జాతీయ స్థాయిలో నిర్వహించిన వివిధ హాకీ టోర్నమెంట్‌లో ప్రతిభ కనబరిచిన సీనియర్ మహిళా క్రీడాకారిణులను శిక్షణ శిబిరానికి ఎంపిక చేసింది. శిక్షణ శిబిరంలో భాగంగా వచ్చేనెల 2న శిక్షణ పొందుతున్న వారి సంఖ్యను 48కి కుదించినున్నారు. ఇటీవల జరిగిన కామనె్వల్త్ గేమ్స్‌లో పతకం సాధించలేకపోవడం నిరాశ కలిగించిందని కోచ్ హరేంద్ర సింగ్ అన్నాడు. అయితే టోర్నీ మొత్తం మీద జట్టు ప్రదర్శన సంతృప్తికరంగానే ఉందని అన్నాడు. కాంస్య పతకం కోసం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ని చేజార్చుకోవడం మినహాయిస్తే, భారత జట్టు గొప్పగానే ఆడిందని ఆన్నాడు. ఇపుడు అంతా కుర్చొని చర్చించుకుంటామని, కామనె్వల్త్ గేమ్స్‌లో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్త పడతామని అన్నాడు. రాబోయే మహిళల ప్రపంచకప్ హాకీ, ఆసియా క్రీడల్లో పతకాన్ని సాధించేందుకు అవసరమైన విధానాలను, ప్రణాళికలను సిద్ధం చేసుకుంటామని హరేంద్ర చెప్పాడు. త్వరలో జరుగబోయే ఆసియా చాంపియన్స్ ట్రోఫీపై దృష్టి కేంద్రీకరిస్తామని అన్నాడు.