క్రీడాభూమి

తల్లి కాబోతున్న సానియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 23: హైదరాబాద్ స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తల్లి కాబోతున్నట్లు ట్విటర్ వేదికగా వెల్లడించింది. తమ జీవితంలోకి ఓ బేబీ రాబోతున్నట్లు పేర్కొంది. సానియా 2010లో పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తమకు సంతాన ఎపుడు కలిగినా వారి పేర్లలో తమ ఇంటి పేరు వచ్చేలా మీర్జా మాలిక్‌ను జోడించాలని తాను, తన భర్త నిర్ణయించుకున్నామని ఆమె గతంలో ఓ ఇంటర్వ్యూ వెల్లడించింది. షోయబ్ మాలిక్ తనకు అమ్మాయి కావాలని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపింది. బేబీ మీర్జా మాలిక్ అనే హ్యాష్ ట్యాగ్‌తో తాను గర్భం దాల్చిన విషయాన్ని ఆమె అభిమానులతో పంచుకుంది.