క్రీడాభూమి

త్వరలో మైదానంలోకి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 23: మోచేతి గాయంతో గత కొన్ని రోజుల నుండి ఐపీఎల్ మ్యాచ్‌లకు దూరంగా ఉన్న టీమిండియా క్రికెటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ త్వరలో మైదానంలో అడుగుపెట్టనున్నట్లు స్పష్టం చేశాడు. కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధావన్ గాయంతో రిటైర్డ్ హట్‌గా పెవిలియన్ పట్టిన సంగతి తెలిసిందే. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌కు సైతం దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో ధావన్ తన గాయంపై మాట్లాడుతూ.. తన మోచేతి వెముక విరగలేదని, త్వరలోనే మైదానంలో అడుగుపెట్టి, తన గాయం త్వరగా నయం కావాలని.. మెసేజ్‌లు పంపించిన అభిమానులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలుపుతూ ట్విటర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. మోచేతి గాయం పూర్తిగా నయవౌతుందని, త్వరలోనే మైదానంలోకి వస్తా నంటూ.. అప్పటివరకు ఐపీఎల్‌ను ఆస్వాదించండి అని ట్వీట్‌లో పేర్కొన్నాడు. ధావన్‌కు తగిలిన గాయం అంతపెద్దది కాదని, బంతి నేరుగా మోచేతికి తగలడంతో వాపు వచ్చిందని సన్‌రైజర్స్ హైదరాబాద్ మెంటర్ వీవీఎస్ లక్ష్మణ్ తెలిపాడు. డ్యాషింగ్ ఓపెనర్, ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్ కూడా లీగ్‌కు దూరమవ్వడంతో సన్‌రైజర్స్ బలం కోల్పోయింది.
ఈ క్రమంలో జట్టు బ్యాటింగ్ బాధ్యతలను నెత్తిన పెట్టుకున్న ధావన్ దూరం కావడం సన్‌రైజర్స్ బ్యాటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపింది. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 7, రాజస్తాన్ మ్యాచ్‌లో 77, ముంబయితో జరిగిన మ్యాచ్‌లో 45 పరుగులు చేసిన ధావన్ జట్టు విజయంలో ప్రధాన భూమిక పోషించాడు.