క్రీడాభూమి

నేటి నుంచి గ్రాండ్‌స్లామ్ క్యారమ్ టోర్నీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 27: ప్రతిష్టాత్మకమైన హసీనా స్మారక ప్రథమ గ్రాండ్ స్లామ్ క్యారమ్ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నమెంట్‌లో అమెరికా, మలేషియా, మాల్దీవులుతో పాటు భారత్‌కు చెందిన అంతర్జాతీయ స్థాయి క్యారమ్ క్రీడాకారులు టోర్నమెంట్ ప్రత్యేక అకర్షణగా నిలువనున్నారు. క్యారమ్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ (క్యాట్స్) పర్యవేక్షణలో హైదరాబాద్ క్యారమ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హాసీనా స్మారక ప్రథమ ఇండియన్ గ్రాండ్ స్లామ్ క్యాష్ ప్రైజ్ క్యారమ్ టోర్నమెంట్ ఈనెల 28 నుంచి మే 1వరకు నిర్వహిస్తారు. నాలుగు రోజుల పాటు మియపూర్‌లోని నారేన్ కనె్వన్షన్ సెంటర్‌లో నిర్వహిస్తారు. టోర్నమెంట్‌లో పురుషులు, మహిళల విభాగంలో సింగిల్స్, డబుల్స్‌లో పోటీలు జరుగుతాయి. టోర్నమెంట్ క్యాష్‌ప్రైజ్ మనీ మొత్తం ఐదు లక్షల రూపాయలు. టోర్నమెంట్‌లో భాగంగా పురుషుల సింగిల్స్ విభాగంలో గెలుపొందిన వారికి రూ.లక్ష విలువ చేసే బైక్‌ను, మహిళల విభాగంలో గెలుపొందిన వారికి రూ.70వేలు విలువ చేసే స్కూటీని ట్రోఫీలతో పాటు అందజేస్తారు. నగరంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో క్యాట్స్ అధ్యక్షుడు బీకే.హరనాథ్, ఉపాధ్యక్షడు రాజేంద్రన్, నిర్వహణ కార్యదర్శి ఎస్.శోభన్‌రాజ్‌తో కలిసి టోర్నమెంట్ వివరాలు వెల్లడించాడు.
క్యారమ్ చాంపియన్‌షిప్‌లో వివిధ దేశాలకు చెందిన మేటి క్యారమ్ క్రీడాకారులు పాల్గొంటుండంతో టోర్నమెంట్ ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. ప్రథమ గ్రాండ్ స్లామ్ క్యారమ్ టోర్నమెంట్‌లో మొత్తం 704 మంది పాల్గొంటారు. వీరిలో పురుషులు 570, మహిళ క్రీడాకారిణిలు 128 మంది ఉన్నారు. టోర్నమెంట్‌లో మొత్తం 932 మ్యాచ్‌లు ఏడు గ్రూపులుగా 62 బోర్డులపై జరుగుతాయి.