క్రీడాభూమి

సునీల్ ఛత్రికి పద్మశ్రీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 1: ప్రముఖ హాకీ గోల్ స్కోరర్ సునీల్ ఛత్రికి ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం కోసం ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్‌ఎఫ్) కేంద్రానికి సిఫారసు చేసింది. ఛత్రి భారత ఫుట్‌బాల్ తరపున వివిధ మ్యాచ్‌లలో ఆడిన సందర్భంగా అత్యధికంగా 56 గోల్స్‌తో ప్రపంచ పుటల్లో మంచి స్ట్రైకింగ్ రేటుతో దూసుకుపోతున్నాడు. ఒక జట్టుకు నాయకత్వం వహించడమే కాకుండా దానిని విజయవంతంగా నడిపించిన ఘనతను సాధించిన అగ్రశ్రేణి క్రీడాకారుడిని పద్మశ్రీ అవార్డుతో సత్కరించడం సముచితమని అంటూ ఈ పురస్కారానికి ఛత్రి అన్నివిధాల అర్హుడని ఫుట్‌బాల్ ఫెడరేషన్ అభిప్రాయపడింది. ఫుట్‌బాల్ క్రీడకు అతను అందించిన అపార సేవలు దృష్టిలో పెట్టుకుని ఛత్రితోపాటు జేజే లాల్‌పెక్లువా, గుర్‌ప్రీత్ సింగ్ సంధు పేర్లను సైతం అర్జున అవార్డు కోసం ప్రతిపాదించామని ఏఐఎఫ్‌ఎఫ్ జనరల్ సెక్రెటరీ కుశాల్ దాస్ పేర్కొన్నాడు. గత ఏడాది జూన్ నాటికి దేశంలోనే ఎక్కువ గోల్స్ (కిర్గిస్తాన్‌పై జరిగిన మ్యాచ్‌తో 54 గోల్స్) చేసిన ఆటగాడిగా ఘనత సాధించాడు. 33 ఏళ్ల ఈ బెంగళూరు కెప్టెన్ ఛత్రి 17 ఏళ్ల ప్రాయంలో 2002లో మోహన్ బగాన్ మ్యాచ్‌తో ఫుట్‌బాల్ క్రీడా జీవితాన్ని ప్రారంభించాడు. అనంతరం ఎన్నో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై అత్యధిక గోల్స్ చేసిన ఘనత సాధించిన భారతీయుడిగా వినుతికెక్కాడు. ఇంతవరకు అతను ఐదు రాష్ట్రాల్లోని 10 క్లబ్బులు, మూడు దేశాల్లో జరిగిన మ్యాచ్‌లలో ఆడాడు.