క్రీడాభూమి

భారత గ్రాండ్ స్లామ్ క్యారమ్ టోర్నీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 2: ప్రతిష్టాత్మకమైన ప్రథమ భారత గ్రాండ్ స్లామ్ క్యారమ్ టోర్నమెంట్‌లో మహిళల సింగిల్స్ టైటిల్‌ను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అన్ సీడెడ్ క్రీడాకారిణి ఎల్.హరిప్రియ 16-9, 25-5 పాయింట్ల తేడాతో హైదరాబాద్‌కు చెందిన హుస్నా సమీరాపై విజయం సాధించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. రెండు సెట్‌ల పాటు కొనసాగిన ఫైనల్ మ్యాచ్‌లో హరిప్రియ చక్కటి ఆటతీరును ప్రదర్శించి సునాయాసంగా గెలుపొంది రూ.50 వేల క్యాష్ ఆవార్డుతో పాటు స్కూటీని గెలుచుకుంది.
క్యారమ్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ (క్యాట్స్) పర్యవేక్షణలో హైదరాబాద్ క్యారమ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హసీనా స్మారక ప్రథమ భారత గ్రాండ్ స్లామ్ క్యాష్ ప్రైజ్ క్యారమ్ టోర్నమెంట్ మియాపూర్ నారేన్ కనె్వన్షన్ సెంటర్‌లో ముగిసింది. టోర్నమెంట్‌లో జరిగిన మహిళల విభాగం సింగిల్స్ సెమీ ఫైనల్లో హరిప్రియ 20-7, 25-11 పాయింట్ల తేడాతో హైదరాబాద్ ఆసేంచర్‌కు చెందిన టాప్ సీడ్ డి.తేజస్వినిపై విజయం సాధించింది.
హరిప్రియ ఇప్పటివరకు ఆరుమార్లు ఆంధ్ర స్టేట్ చాంపియన్‌గా నిలిచింది. ఆంధ్ర తరపున పాల్గొని సీనియర్, జూనియర్ స్థాయి క్యారమ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొంది. జాతీయ స్థాయిలో అండర్-12 టైటిల్‌ను గెలుచుకుంది. ఆంధ్ర స్టేట్ క్యారమ్ సంఘం నిర్వహించిన టోర్నమెంట్‌లో హరిప్రియ నాలుగింటిలో హుస్నాసమీరాపై గెలిచింది. మహిళల డబుల్స్ ఫైనల్లో హైదరాబాద్ డి.తేజాస్విని, హరిప్రియల జోడి 25-10తో ఆంధ్రకు చెందిన సంధ్య, సమీరాలపై విజయం సాధించి టైటిల్‌ను సొంతం చేసుకుంది.