క్రీడాభూమి

షూటర్ రిజ్వీనే నెంబర్ వన్ ఇంటర్నేషనల్ షూటింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 2: భారత షూటర్ షహజార్ రిజ్వీ ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ (ఐఎస్‌ఎస్‌ఎఫ్) 10 మీటర్ల పిస్టల్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచి నెంబర్ వన్ ర్యాంక్‌ను చేజిక్కించుకున్నాడు. గత వారం కొరియాలో జరిగిన వరల్డ్‌కప్‌లో రజతం సాధించడంతో ఆగ్రస్థానానికి ఎగబాకాడు. భారత వైమానికి దళానికి చెందిన రిజ్వీ మెక్సికోలో గత మార్చిలో జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ కప్ పురుషుల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో జితూ రాయ్ (కామనె్వల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్) ఆరో స్థానం, రవి కుమార్, దీపక్ కుమార్ వరుసగా నాలుగు, తొమ్మిది స్థానాల్లో నిలిచారు. 50 మీటర్ల రైఫిల్ తీ పొజిషన్స్‌లో అఖిల్ షరోన్, సంజీవ్ రాజ్‌పుఠ్ నాలుగు, ఎనిమిది స్థానాల్లో నిలిచారు. కామనె్వల్త్ గేమ్స్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో గోల్డ్ మెడల్ సాధించిన మను భాకర్ నాలుగో స్థానంలో నిలవగా, మెహులీ ఘోష్ ఏడో ర్యాంక్ సాధించింది. 50 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో అంజుమ్ వౌడ్గిల్ ఎనిమిదో స్థానంలో నిలిచింది.