క్రీడాభూమి

ఐసీసీ వనే్డ ర్యాంకింగ్స్‌లో భారత్ చేజారిన అగ్రస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, మే 2: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో టెస్టుల్లో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్న భారత్.. వనే్డల్లో మాత్రం రెండోస్థానానికి పడిపోయింది. టీమిండియా కెప్టెన్ కోహ్లీ సేనను వెనక్కి నెట్టిన ఇంగ్లాండ్ టాప్ పొజిషన్‌ను సొంతం చేసుకుంది. 2013 సంవత్సరం తర్వాత ఇంగ్లాండ్ జట్టు వనే్డల్లో నంబర్ వన్‌గా నిలవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. తాజా ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని వనే్డలో కోల్పోయిన భారత్, టీ-20లో తృతీయ స్థానంలో నిలిచింది. ఈ మేరకు ఐసీసీ తాజాగా వనే్డతో పాటు టీ-20 ర్యాంకులను ప్రకటించింది. వనే్డ ర్యాంకుల సమీకరణలో 2014-15 గెలుపోటములను పక్కన పెట్టి 2015-16, 2016-17 సీజన్లలో నిర్వహించిన టోర్నమెంట్‌లో ఆయా జట్లు కనపరిచిన గెలుపోటములను పరిగణలోకి తీసుకుని ఐసీసీ ర్యాంకులను ప్రకటించింది. ఇందులో భాగంగా ఇంగ్లాండ్‌కు 8 పాయింట్లు అదనంగా జోడు కాగా, భారత్ తన ఖాతాలోంచి ఒక పాయింట్ కోల్పోయి ద్వితీయ స్థానంలో నిలిచింది. దీంతో ఇంగ్లాండ్ 125 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. దక్షిణాఫ్రికా 113, న్యూజిలాండ్ 112, ఆస్ట్రేలియా 104, పాకిస్తాన్ 102, బంగ్లాదేశ్ 93, శ్రీలంక 77, వెస్టిండీస్ 69, అఫ్గనిస్థాన్ 63 పాయింట్లతో మూడు నుంచి పదిలోపు స్థానాల్లో నిలిచాయి. ఈ సంవత్సరం భారత్ ఇంగ్లాండ్ పర్యటనలో పాల్గొని వనే్డ సిరీస్‌లో మ్యాచ్‌లు అడనుంది.
* టీ-20లో టాప్‌లో పాకిస్తాన్
టీ-20 ఫార్మాట్ ర్యాంకుల్లో మాత్రం తొలి ఏడు స్థానాల్లో ఎలాంటి మార్పుల్లేవు. టీమిండియా రెండు పాయింట్లు సాధించినప్పటికీ 123 పాయింట్లతో తృతీయ స్థానంలో కొనసాగుతోంది. కాగా, పాకిస్తాన్ 130 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఆస్ట్రేలియా 126 పాయింట్లతో ద్వితీయ స్థానంలో న్యూజిలాండ్ 116, ఇంగ్లాండ్ 115తో నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. దక్షిణాఫ్రికా 114, వెస్టిండీస్ 114 పాయింట్లతో ఆరు, ఏడు స్థానాలను దక్కించుకున్నాయి. శ్రీలంకను వెనక్కి నెట్టిన అఫ్గనిస్తాన్ 8వ స్థానంలో, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తొమ్మిది, పది స్థానాలో నిలిచాయి. దిగ్గజాల రిటైర్మెంట్‌తో శ్రీలంక పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది.