క్రీడాభూమి

ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజా సేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 2: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగిగా తనకు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని, ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాంత్‌ను రాష్ట్రప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్‌గా నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం శ్రీకాంత్ విధుల్లో చేరారు. కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కోన శశిధర్‌కు డిప్యూటీ కలెక్టర్‌గా విధుల్లో చేరుతున్నట్టు శ్రీకాంత్ లిఖితపూర్వకంగా తెలియజేశారు. ఇందుకు సంబంధించిన జాయినింగ్ రిపోర్టును అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ శశిధర్ మాట్లాడుతూ బ్యాడ్మింటన్ క్రీడా విభాగంలో అత్యంత ప్రతిభకనబర్చి, అనే విజయాలు సాధించి జిల్లా, రాష్ట్రం, దేశానికి పేరు ప్రతిష్ఠలు తీసుకువచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం శ్రీకాంత్‌ను డిప్యూటీ కలెక్టర్‌గా నియమించిందన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రప్రభుత్వ ఆదేశాల మేరకు, శ్రీకాంత్ కోరిక మేరకు గుంటూరులో డిప్యూటీ కలెక్టర్‌గా ఉత్తర్వులు ఇచ్చారన్నారు.
ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందనడానికి తన నియామకమే నిదర్శనమని శ్రీకాంత్ అన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె నాగబాబు, రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘ అధ్యక్షుడు రాయపాటి రంగారావు పాల్గొన్నారు.