క్రీడాభూమి

వరల్డ్ ఎలెవన్ జట్టుకు హార్దిక్, దినేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, మే 3: టీం ఇండియా ఆటగాళ్లు దినేశ్ కార్తీక్, హార్థిక్ పాండ్యాలను ఐసీసీ వరల్డ్ ఎలెవన్ జట్టుకు ఎంపికచేసింది. ఈనెల 31వ తేదీన ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరుగనున్న టీ-20 మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టుతో వరల్డ్ ఎలెవన్ జట్టు తలపడునుంది. గతేడాది ఇర్మా తుఫాను వల్ల కరేబియన్‌లోని పలు స్టేడియంలు, మైదానాలు నేలమట్టవడంతో, వాటి స్థానంలో స్టేడియంలను పుననిర్మించేందుకు చారిటీ మ్యాచ్ నిర్వహించి తద్వారా వచ్చిన విరాళాలను సేకరించాలని ఐసీసీ నిర్ణయించిన విషయం విదితమే. ఇందులో భాగంగా ఇంగ్లాండ్ లార్డ్స్ వేదికగా ఈనెల 31న వెస్టిండీస్‌తో ప్రపంచ ఎలెవన్ జట్టు పోటీ పడనుంది. ప్రపంచ ఎలెవన్ జట్టుకు ఇంగ్లాండ్ క్రికెటర్ ఇయాన్ మోర్గాన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ప్రపంచ ఎలెవన్ జట్టుకు ఎంపిక చేసిన వారిలో భారత్ నుండి హార్థిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్‌లుండగా, పాకిస్తాన్ నుండి షోయబ్ మాలిక్, షాహిదీ అఫ్రిదీ, శ్రీలంక నుండి తిసారా పెరీరా, బంగ్లాదేశ్ నుండి షకీబ్ ఆల్ హసన్, తమీమ్ జాక్బాల్, అఫ్గానిస్తాన్ నుండి రషీద్ ఖాన్‌లున్నారు. పాండ్యా, కార్తీక్ పరిమిత ఓవర్ల మ్యాచ్‌లో గతకొంత కాలంనుంచి చక్కటి ఆటతీరును ప్రదర్శించి పలువురిని ఆకట్టుకున్న విషయం తెలిసిందే. నిదహాస్ ట్రోఫీ ఫైనల్లో బంగ్లాదేశ్‌పై కార్తీక్ భారత్‌కు చక్కటి విజయాన్ని అందించాడు. ఇప్పటికి తొమ్మిది మంది ఆటగాళ్లను ప్రకటించిన ఐసీసీ త్వరలో మిగతా జట్టు సభ్యులను ఎంపిక చేయనుంది. ఇది ఇలా ఉండగా ప్రపంచ ఎలెవన్ ఢీకొంటున్న వెస్టిండీస్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇంగ్లాండ్ జట్టుకు కార్లోస్ బ్రాత్‌వైట్ కెప్టెన్‌గా, క్రిస్‌గేల్, సామ్యూల్ బద్రీలతో కూడిన 13 మంది సభ్యులు కలిగిన జాబితాను ప్రకటించింది. వరల్డ్ ఎలెవన్ జట్టుకు సారథ్యం వహించే అవకాశం రావడంపై ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్ అనందం వ్యక్తం చేసి, ప్రకృతి వైపరిత్యాలు సంభవించినపుడల్లా క్రికెట్ కుటుంబం మద్దతుగా నిలుస్తూ వచ్చిందన్నాడు. ప్రపంచ స్థాయి ఆటగాళ్ల మధ్య జరిగే ఈ టీ-20 మ్యాచ్ ప్రేక్షకులను రంజింప చేయనుందని మోర్గావ్ తెలిపాడు. అంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం, అంగ్విల్లాలోని రొనాల్డ్ వెబ్‌స్టర్ పార్క్ డొమినికాలోని విండ్‌సోర్ పార్క్, బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్‌లోని ఏవో షిర్లీ రిక్రియేషన్ గ్రౌండ్, సెయింట్ మార్టెన్‌లోని కరీబ్ లుంబెర్ బాల్ పార్క్‌లను పుననిర్మించేందుకు నిధుల సేకరణ కోసం ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తోంది ఐసీసీ. గతేడాది సంభవించిన ఇర్మా, మారియా తుపానుల కారణంగా ఇవన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ మ్యాచ్‌కు టీ-20 హోదా ఇవ్వాలని ఐసీసీ నిర్ణయించింది.