క్రీడాభూమి

హరీందర్‌కు తీరిక ఎక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 3: భారత పురుషుల హాకీ జట్టు తలరాతను మార్చేందుకు కోచ్ హరీందర్ సింగ్ అంత సమయం లేదని భారత పురుషుల హాకీ జట్టు మాజీ కోచ్ జాక్విమ్ కార్వెల్‌హో అన్నాడు. ఇటీవల కాలం వరకు మహిళల జట్టు కోచ్‌గా ఉన్న హరీందర్ సింగ్‌ను మళ్లీ పురుషుల జట్టు కోచ్‌గా మళ్లీ హరీందర్ సింగ్‌ను నియమించడాన్ని ఆయన స్వాగతించాడు. హరీందర్ సింగ్ నియామకం భారత హాకీకి శుభపరిణామమని, రానున్న రోజుల్లో అతని నాయకత్వంలో జట్టు మరిన్ని విజయాలను నమోదు చేయాలని ఆకాంక్షించాడు. అయితే, రానున్న ఆసియా గేమ్స్‌తోపాటు కొన్ని టోర్నమెంట్లలో పాల్గొనే జట్టును మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు కొత్త కోచ్‌కు తగిన సమయం లేదని ఆయన అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది చివరివరకు భారత్ జట్టు ఆగస్టులో జకార్తా ఆసియా గేమ్స్‌తోపాటు నవంబర్-డిసెంబర్ మధ్య కాలంలో భువనేశ్వర్‌లో వరల్డ్ కప్ వంటి రెండు ప్రధాన టోర్నమెంట్లలో ఆడుతుందని ఆయన అన్నాడు. కోచ్‌గా జూనియర్ వరల్డ్ కప్ సాధించడంలో హరీందర్ సింగ్ సమర్థవంతమైన పాత్రను పోషించాడని అన్నాడు. జర్మనీలో జూనియర్ టీమ్ ఆడిన యువకులు ఆ తర్వాత సీనియర్ జట్టులో ఆడేందుకు అవకాశం వచ్చినపుడు అప్పటివరకు జూనియర్ జట్టుకు కోచ్‌గా ఉన్న వ్యక్తిని సీనియర్ జట్టు కోచ్‌గా మార్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశాడు. దీనివల్ల మంచి ఫలితాలను ఆశించవచ్చునని, పురుషుల జట్టుకు కూడా మరింత మేలు చేకూరుస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశాడు. ఇదిలావుండగా, పురుషుల జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన సజోర్డ్ మారిజ్నే పర్యవేక్షణలో ఇటీవల గోల్డ్ కోస్ట్‌లో జరిగిన హాకీ టోర్నమెంట్‌లో ఆశించిన ఫలితాలు కానరాకపోవడంతో అతనిని తప్పించి మళ్లీ మహిళల జట్టుకు కోచ్‌గా నియమించిన విషయమై మాజీ కోచ్ మాట్లాడుతూ పురుషుల జట్టును విజయవంతంగా నడపడంలో విఫలమైన మారిజ్నే మహిళల కోచ్‌గా కూడా ఆశించిన రీతిలో ఫలితాలు తీసుకురాలేకపోయాడని వ్యాఖ్యానించాడు.