క్రీడాభూమి

కోల్‌కతా ఘనవిజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మే 3: ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆరు వికెట్ల తేడాతో ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించింది. నైట్ రైడర్స్ బ్యాట్స్‌మన్‌లు శుభం గిల్ కెప్టెన్ దినేష్ కార్తీక్‌తో కలిసి 83 పరుగుల భాగస్వామ్యం సాధించడంతో 178 పరుగుల విజయలక్ష్యాంతో బ్యాటింగ్ బరిలోకి దిగిన కోల్‌కతా 17.4 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసి విజయ లక్ష్యాన్ని అధిగమించింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బ్యాట్స్‌మెన్‌లు అంతగా రాణించలేకపోయారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఫీల్డీంగ్ ఎంచుకుంది. ఐపీఎల్‌లో ఎనిమిది మ్యాచ్‌ల్లో విజయం సాథించిన చెన్నై తొలుత బ్యాటింగ్ చేపట్టి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఆశించిన రీతిలో బ్యాట్స్‌మెన్‌లు వేగంగా ఆడలేకపోయారు. చెన్నై బ్యాట్స్‌మన్‌లు వరుసగా పెవిలియన్ వైపు పట్టడంతో భారీ స్కోరు సాధించే అవకాశం ఉన్న వినియోగించుకకోలేదు. కెప్టెన్ ధోనీ బ్యాటింగ్‌లో మరోసారి రాణించి చివరి నిమిషం వరకు పోరాడి 25 బంతులనెదుర్కొని ఒక సిక్సర్, నాలుగు బౌండరీల సహయంతో 43 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై జట్టులో మరోసారి వాట్ససన్‌తో కలిసి ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు దిగిన డూప్లెసిస్ 27 పరుగులు సాధించాడు. ఆట ప్రారంభం నుండి దూకుడుగా ఆడిన డూప్లెసిస్ ఆరో ఓవర్ తొలి బండికే చావ్లా బౌలింగ్‌లో ఔటాయ్యాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన రైనా తన శైలిలో బ్యాటింగ్‌లో రాణించి వరుస బౌండరీలతో అకట్టుకున్నాడు. వాట్సన్‌తో కలిసి కట్టుగా ఆడి స్కోరు వేగాన్ని పెంచాడు. వాట్సన్ 36 పరుగులు సాధించాడు. నరైన్ బౌలింగ్‌లో వాట్సన్, మరసటి ఓవర్‌లో కుల్‌దీప్ బౌలింగ్‌లో రైనా 31 పరుగులు చేసి వెనుతిరిగాడు. దీంతో చెన్నై స్కోరు వేగం తగ్గింది. బ్యాటింగ్‌లో మంచి ఫామ్‌లో ఉన్న రాయుడు 21 పరుగులు చేసి కీలక సమయంలో పెవిలియన్ దారిపట్టాడు. ధోని మాత్రం వరుస సిక్సర్లతో విరుచుకుపడుతూ చివర్లలో స్కోరు బోర్డును పరుగులు పెట్టించడంతో చెన్నై సూపర్ కింగ్స్ ప్రత్యర్థి జట్టు ముందు 178 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలింగ్‌లో పీయుష్ చావ్లా 35 పరుగులిచ్చి రెండు వికెట్లు, సునిల్ నారైన్ 20 పరుగులిచ్చి రెండు వికెట్లు, కుల్దీప్ యాదవ్ 34 పరుగులిచ్చి వికెట్ తీసుకున్నాడు.
అనంతరం బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 17.4 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసి విజయ లక్ష్యాన్ని అధిగమించింది. జట్టులో బ్యాటింగ్‌లో రాణించిన శుభం గిల్ 36 బంతుల్లో రెండు సిక్సర్లు, ఆరు బౌండరీల సహయంతో 57 పరుగులతో అర్థ సెంచరీ పూర్తి చేయగా, జట్టు కెప్టెన్ దినేష్ కార్తీక్ 18 బంతుల్లో 45 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. కాగా, జట్టులో సునీల్ నరైన్ 32, రింకు సింగ్ 16, రాబీన్ ఉతప్ప 6 పరుగులు సాధించారు.