క్రీడాభూమి

ముంబయికి చావో రేవోగెలిస్తేనే ముందుకు * నేడు పంజాబ్‌తో కీలక మ్యాచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, మే 3: డిఫెండింగ్ ఛాంపియన్లు ముంబయి ఇండియన్లకు శుక్రవారం కింగ్స్-11తో జరిగే మ్యాచ్ కీలకం కానుంది. ఇది వారికి చావో రేవో అనదగ్గ మ్యాచ్. మూడుసార్లు ఐపీఎల్ ఛాంపియన్లుగా నిలిచిన ముంబయి ఇండియన్స్ జట్టు ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటివరకు మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు ఆడి కేవలం రెండింటిలో మాత్రమే విజయం సాధించింది. అదే రవిచంద్రన్ కెప్టెన్‌గా ఉన్న కింగ్స్-11 జట్టు ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఐదింటిలో నెగ్గి మంచి ఆత్మవిశ్వాసంతో ఉన్నది. అంతేకాదు క్రమంగా ‘ప్లే ఆఫ్’ దిశగా దూసుకెళుతోంది. కింగ్స్-11 పంజాబ్ జట్టులో ‘ఆరంజ్ క్యాప్’లు, ‘పర్పుల్ క్యాప్‌లు’ లేరు. ఐపీఎల్‌లో ఈ రెండు క్యాప్‌లను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌కు ఆరంజ్ క్యాప్‌ను, అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌కు పర్పుల్ క్యాప్‌ను ఇస్తారన్న సంగతి తెలిసిందే. కాగా కింగ్స్-11 పంజాబ్ జట్టులో అవసరమైన సమయాల్లో ప్రతి ఒక్కరూ అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించడం వల్లనే జట్టు ఈ స్థాయికి రాగలిగింది. అదీ కాకుండా వారం పాటు విశ్రాంతి దొరకడం, క్రిస్ గేల్, కెఎల్ రాహుల్‌కు మరింత శక్తిని పుంజుకోవడానికి వీలు కల్పించిందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ‘యూనివర్స్ బాస్’గా పేరుపడ్డ క్రిస్ గేల్, ఈ సీజన్‌లో తన బ్యాటింగ్‌తో బౌలర్లను ఊపిరిసలపనివ్వలేదు. రెండు అర్థ సెంచరీలు, ఒక సెంచరీతోమొత్తం 252 పరుగులు సాధించాడు. ఇక రాహుల్ ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటివరకు 268 పరుగులు సాధించాడు. ఇందులో ఐపీఎల్ చరిత్రలో అతివేగంగా పూర్తి చేసిన అర్థ సెంచరీ కూడా రాహుల్ ఖాతాలోనే ఉండటం విశేషం. ఇక అఫ్ఘనిస్తాన్ స్పిన్ బౌలర్ ముజీబుర్ రహమాన్ 6.51 సగటుతో పొదుపుగా చేసిన బౌలింగ్ కూడా టీంకు కలిసొచ్చింది. అందుకే కెప్టెన్ అశ్విన్ ముజిబూర్ రహమాన్‌ను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ తనకు అవసరమైన రీతిలో ఆటలో అతని సేవలను ఉపయోగించుకుంటున్నాడు. ఇక పేసర్లు అంకిత్ రాజ్‌పుట్ (6.27 సగటుతో 7 వికెట్లు), ఆండ్రూ టై (7.78 సగటుతో 9 వికెట్లు) జట్టు గెలుపునకు రాచబాట వేసాయి. ఇక ముంబయి విషయానికి వస్తే మొత్తం ఆరు పరాజయాలకు ప్రధాన కారణం ఒపెనర్ల ఆటతీరు దారుణంగా ఉండటం. దీనికి తోడు బౌలర్లు పొదుపుగా పరుగులు ఇవ్వడంలో, వికెట్లు తీయడంలో విఫలం కావడం. అయితే జట్టులోని సూర్యకుమార్ యాదవ్ ఇప్పటివరకు 283 పరుగులు చేసి ఉత్తమ ఆటను ప్రదర్శించడంతో బ్యాటింగ్‌లో అతనికి ప్రమోషన్ లభించింది. ఇక కరీబియన్ ఎడమచేతి బ్యాట్స్‌మన్ ఇవిన్ లూరుూస్ (ఏడు మ్యాచ్‌ల్లో 194 పరుగులు) ఇంకా అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో చూపిన సత్తాను ఇక్కడ చూపలేకపోవడం గమనార్హం. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ (8 మ్యాచ్‌ల్లో 194 పరుగులు) తన బ్యాటింగ్ పొజిషన్‌ను కోల్పోవడం, అస్థిరమైన బ్యాంటింగ్ ముంబయి ఇండియన్ టీమ్‌కు శాపంగా మారింది. ఎనిమిది గేమ్‌లో ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ వరుసగా 7, 11, 102, 1, 12, 69, 5 పరుగులు చేశారు. దీన్నిబట్టి చూస్తే వీరు కేవలం రెండు మ్యాచ్‌ల్లో గట్టి పునాది వేయగలిగినా, సిఎస్‌కేపై ఆడిన మ్యాచ్‌లోనే జట్టు విజయం సాధించగలిగింది. దీనికి తోడు ముంబయి ఇండియన్స్ జట్టులో ఆల్‌రౌండర్లయిన కిరన్ పొల్లార్డ్, హార్దిక్ పాండ్యాల ఆటతీరు దారుణంగా ఉండటం వరుస పరాజయాలకు రాచబాట వేసింది. పొల్లార్డ్ బౌలింగ్ ఆశించిన స్థాయిలో లేదు.
బ్యాటింగ్ 6 ఇన్నింగ్స్‌లో 76 పరుగులు చేయడం జట్టుపరంగా తీవ్ర నిరాశను కలిగించే అంశం. హార్దిక్ పాండ్యా కూడా ఏమంత గొప్ప ప్రదర్శన ఇవ్వలేదు. ఒక అర్థ సెంచరీతో సహా మొత్తం 111 పరుగులు చేయడం నిజంగా దారుణం. బౌలింగ్‌లో 11 వికెట్లను తీశాడు. ఇక ముస్త్ఫాజుర్ రెహమాన్ (7 వికెట్లు), మిచెల్ మెక్‌లెనాఘన్ (9 వికెట్లు)లు తమ బౌలింగ్‌లో అధిక పరుగులు ఇచ్చారు. వీరి బౌలింగ్ ఎకానమీ రేట్లు వరుసగా 8.34, 8.66 ఎంతమాత్రం జట్టు విజయానికి దోహదం చేయనివే. ఫలితంగా జస్‌ప్రిట్ బుమ్రా ( 7 పరుగుల సగటుతో 9 వికెట్లు), హార్దిక్ పాండ్యా (8.74 పరుగుల సగటుతో 11 వికెట్లు)లపై వత్తిడి పెరిగిపోయింది. ఇక ముంబయి ఇండియన్స్ టీమ్‌లో ఈ సీజన్‌లో చెప్పుకోదగ్గ ఆటగాడు మయాంక్ మార్కండే (11 వికెట్లు). అతి కీలక మ్యాచ్‌ల్లో కూడా ఈ టీనేజర్ అద్భుతమైన బౌలింగ్ ప్రతిభను కనబరచడం విశేషం.