క్రీడాభూమి

పడిలేచిన కెరటంలా వస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మే 3: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మూడుసార్లు డిఫెండింగ్ చాంపియన్లుగా అవతరించిన తమ జట్టు ఇటీవల కాలంలో ఎదురైయ్యే వరుస ఓటములతో డీలా పడలేదని, పడి లేచిన కెరటంలా మళ్లీ పుంజుకుంటామని ముంబయి ఇండియన్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ అన్నాడు. ప్రస్తుత సీజన్‌లో ఇంతవరకు తమ టీమ్ ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో కేవలం రెండు మ్యాచ్‌లలో విజయం సాధించి, మిగిలిన ఆరు మ్యాచ్‌లలో ఓటమి చెందినంత మాత్రాన తామేమీ కృంగిపోవడం, మదనపడడం లేదని ఆయన స్పష్టం చేశాడు. తమకు ఇంకా మరో ఆరు మ్యాచ్‌లు ఆడేందుకు అవకాశం ఉందని, ఈ మ్యాచ్‌లలో గెలుపు కోసం తగిన కార్యాచరణ రూపొందిస్తున్నామని, తద్వారా విజయావకాశాలను మెరుగుపరచుకుంటామనే ధీమాను ఆయన వ్యక్తం చేశాడు. 2015 సీజన్‌లో జరిగిన ఐపీఎల్‌లో రెండోసారి టైటిల్‌ను ఎగురవేసుకుపోయే విధంగా తమ ఆటతీరు ఉండబోతుందని ఆయన అభిప్రాయపడ్డాడు. ‘మాకు ఇంకా ఆడేందుకు ఆరు మ్యాచ్‌లే మిగిలివున్నాయి. వీటన్నింటిలోనూ విజయం సాధించాల్సిన బాధ్యత ఉంది. ఇందుకు ఏంచేయాలో సరైన ప్రణాళికతో ముందుకు సాగబోతున్నాం. సమర్థవంతమైన ఆటగాళ్లతో అన్ని మ్యాచ్‌లలో విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది’ అని షేన్ బాండ్ పేర్కొన్నాడు. తప్పనిసరిగా 2015లో సాధించిన విజయాన్ని మళ్లీ ఇపుడు పునరావృతం చేస్తామనే ఉందని, ఆ దిశగా గట్టి ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన అన్నాడు.