క్రీడాభూమి

అమెరికా టెన్నిస్ అసోసియేషన్‌లో జాతివివక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, మే 3: నల్లజాతికి చెందిన మాజీ టెన్నిస్ అంపైర్, యునైటెడ్ స్టేట్స్ టెన్నిస్ అసోసియేషన్‌పై (యుఎస్‌టీఏ) ఫెడరల్ కోర్టులో ఫిర్యాదు చేశాడు. తనపై జాతివివక్ష చూపారని, నల్లజాతి వాడంటూ హేళన చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఒక దశలో సహచర అంపైర్ తనను ‘కోతి’ అంటూ హేళన చేశాడని కూడా అందులో పేర్కొన్నాడు. ఇటువంటి అవమానాల కారణంగా తాను బలవంతంగా టెన్నిస్ క్రీడనుంచి బయటకు రావాల్సి వచ్చిందని కూడా గత వారం బ్రూక్లిన్ లోని ఫెడరల్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నాడు. నల్లజాతికి చెందిన ఆంథోని నిమ్మొన్స్ 1994లో యుఎస్‌టీఏలో అంపైరింగ్ వృత్తిలో ప్రవేశించాడు. సంస్థలో నెలకొన్న జాతివివక్ష పరిస్థితులపై మాట్లాడినందుకు, తనను డిమోట్ చేయడమే కాకుండా, తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. కాగా దీనిపై యుఎస్‌టీ స్పందిస్తూ, ‘పని ప్రదేశంలో జాతివివక్షను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని, పనికి మాత్రమే ప్రాధాన్యతనిస్తామని’ స్పష్టం చేసింది. ‘నిమ్మొన్స్ చేసిన ఆరోపణలను నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాం. ఈ వ్యాజ్యాన్ని గట్టిగా ఎదుర్కొంటాం’ అని పేర్కొంది. ఇదిలావుండగా నిమ్మొన్స్ సంస్థలో తనకు జరిగిన అవమానాలను పిటిషన్‌లో ఈవిధంగా పేర్కొన్నాడు. న్యూయార్క్ సిటీలో 2013లో జరిగిన యుఎస్ ఓపెన్ పోటీల్లో సహచర అంపైర్ తనను ‘ఏయ్ టోనీ, నువ్వు ఆకలితో ఉన్న కోతివైతే, అక్కడే పుచ్చకాయ చెట్టు ఉంది. అక్కడికి వెళ్లు’ అంటూ తనను అవమానించాడన్నారు. అదేవిధంగా 2012లో డల్లాస్‌లో జరిగిన దిగువస్థాయి పోటీలో, మరో అంపైర్ కూడా తనను వ్యంగ్య వ్యాఖ్యలతో అవమానించారని ఆరోపించాడు. ‘నన్ను నా పనినుంచి తప్పించారు. లేకపోతే ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ వంటి పోటీలకు వెళ్లివుండేవాడిని’ అని నిమ్మొన్స్ పేర్కొన్నాడు. ‘టెన్నిస్ అంటే నాకు ప్రాణం. యుఎస్‌టీఏలో ఉద్యోగం చేయాలనివుంది’ అని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా నిమ్మొన్స్ ఆరోపణలపై విచారించిన ‘ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీ కమిషన్’ కూడా అతను చేసిన ఆరోపణలకు సంబంధించి విశ్వసనీయమైన సాక్ష్యాలున్నాయి అని వ్యాఖ్యానించడం విశేషం.

సెమీస్‌కు లివర్‌పూల్
లండన్, మే 3: యూరోపియన్ ఎలైట్ క్లబ్ ఛాంపియన్స్ లీగ్ పోటీల్లో లివర్‌పూల్ సెమిఫైనల్స్‌కు చేరుకుంది. జర్గన్ క్లోప్ ప్రావీణ్య స్ఫూర్తితో మహమ్మద్ సలాహ్ అద్భుత ప్రదర్శన కారణంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో లివర్‌పూల్, రోమా జట్టుపై 4-2 తేడాతో అద్భుతమైన విజయం సాధించింది. ఇప్పటి వరకు ఆడిన 7-6 సగటు విజయాలతో, తన లక్ష్యానికి చేరువయింది. మే 26న జరుగునున్న ఫైనల్ మ్యాచ్‌లో రియల్ మాడ్రిడ్‌పై విజయం సాధిస్తే లివర్‌పూల్‌కు కప్పు కైవసమవుతుంది. ఈ టైటిల్‌ను గతంలో లివర్‌పూల్ మూడుసార్లు గెలుచుకుంది. 1964లో స్కాటిష్ మేనేజర్ ఆధ్వర్యంలో లివర్‌పూల్ ఇంగ్లీషు ఛాంపియన్లుగా నిలిచింది. కాగా లివర్‌పూల్‌కు ఈ విజయంతో పూర్వవైభవం వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.