క్రీడాభూమి

కొండను ఢీకొంటున్న ఢిల్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 4: యువ ఢిల్లీ డేర్‌డెవిల్స్ టీం బ్యాట్స్‌మెన్ జట్టును రంగంలో నిలిపేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ముఖ్యంగా శనివారం ఇక్కడ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగే మ్యాచ్‌లో గట్టి బౌలింగ్‌ను ఎదుర్కొనాల్సి వస్తోంది. ఢిల్లీ డేర్ డెవిల్స్ ప్రస్తుతం ఐపిఎల్ నుంచి ఇంటిదారి పట్టే పరిస్థితిలో ఉన్నది. ఎందుకంటే ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవలం మూడింటిలోనే విజయం సాధించింది. ఇంకా ఆడాల్సిన మ్యాచ్‌లు ఐదున్నాయి. నాలుగు టీమ్‌ల ప్లేఆఫ్ దశకు చేరుకోవాలంటే ఇక ముందు ఏ మ్యాచ్ ఓడిపోకూడదు. కానీ పరిస్థితి చూస్తుంటే జట్టు కష్టాలు ఈడేరా లేవు. గౌతమ్ గంభీర్ తనకు తానే కెప్టెన్సీనుంచి తప్పుకున్నాడు. దీంతో యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలో జట్టు నడుస్తోంది. అయితే డేర్‌డెవిల్స్‌కు విశ్వాసం కలిగించే విజయం బుధవారం దక్కింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలుపు వీరికి కొంతమేర ఆత్మవిశ్వాసం కలిగించవచ్చు. యువ పృథ్వీ షా, కెప్టెన్ అయ్యర్, రిషభ్ పంత్‌లు జట్టుకు ప్రధాన బ్యాట్స్‌మెన్‌లుగా ఉన్నారు. అయితే కోలిన్ మున్రో, క్లెన్ మ్యాక్స్‌వెల్‌లు కూడా అవసరమైతే సత్తా చూపగలరు. అయితే కేవలం ఐదు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో మున్రో, మ్యాక్స్‌వెల్‌లు ఎంతవరకు అవకాశాలను సానుకూలంగా మలచగలుగుతారన్నది ఇక్కడ ముఖ్యం. ఇక బౌలర్ల విషయానికి వస్తే ట్రెంట్ బౌల్ట్ ఇప్పటి వరకు 13 వికెట్లు తీసాడు. యువ అవేశ్ ఖాన్, లియామ్ ప్లున్‌కెట్, స్పిన్నర్ షబాజ్ నదీమ్‌లు అవసరమైన సమయాల్లో సమర్థవంతమైన ఆటతీరును ప్రదర్శించగలరు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే మొత్తం 8 మ్యాచ్‌లో 12 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో ఉంది. ఈ జట్టు బౌలింగ్ చాలా పటిష్టంగా ఉండటం వల్ల ప్రత్యర్థుల పరుగుల వేగాన్ని సమర్ధవంతంగా నియంత్రించగలుగుతోంది. ఫలితంగా ఎస్‌ఆర్‌హెచ్‌తో ఆడిన ఏ జట్టు పెద్దగా స్కోరు చేయలేకపోవడం ఇక్కడ గమనార్హం. హైదరాబాద్ టీమ్‌లో సిద్దార్థ్‌కౌల్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, బాసిల్ థాంపి బౌలర్లతో పాటు షాకిబ్ అల్ హసన్, మహమ్మద్ నబీ, యూసుఫ్ పఠాన్ వంటి ఆల్‌రౌండర్లు కూడా ఉన్నారు. ఎస్‌ఆర్‌హెచ్ విజయ రహస్యం కేవలం జట్టులోని బౌలింగ్ పైనే ఆధారపడి ఉన్నది.
ప్రత్యర్థులను ఇప్పటివరకు జరగిన మ్యాచుల్లో ఎక్కువ స్కోరు చేయకుండా వీరు సమర్ధవంతంగా అరికట్టారు. కింగ్స్-11 జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 19.2 ఒవర్లలో 119 పరుగులకే ఆలౌట్ చేయగలిగింది. ముందు బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ 132 పరుగులు చేసింది. అదేవిధంగా ఏప్రిల్ 29న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 152 పరుగులు చేసింది. ఈ లక్ష్యం పెద్ద కష్టం కానప్పటికీ రాజస్థాన్ రాయల్స్‌ను 20 ఒవర్లలో 140 పరుగులవద్దనే కట్టడి చేసింది. ఎస్‌ఆర్‌హెచ్ స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌ను మిస్ అయినప్పటికీ జట్టులోని బౌలర్లు అద్భుతమైన ప్రతిభ కనబరుస్తుండటం విశేషం. వీపుపై గాయం కావడంతో భువనేశ్వర్ కుమార్ గత కొద్దిమ్యాచ్‌ల్లో పాల్గొనడం లేదు. అయితే జట్టు కెప్టెన్ విలియమ్‌సన్ మాత్రం, శనివారం మ్యాచ్‌లో భువనేశ్వర్ పాల్గొంటాడనే ఆశిస్తున్నాడు. నిజానికి జట్టుకెప్టెన్ డేవిఢ్ వార్నర్. బాల్ ట్యాంపరింగ్ కేసులో ఇరుక్కొని క్రికెట్‌కు దూరమయ్యాడు. దీంతో విలియంసన్‌ను కెప్టెన్సీ వరించింది. విలియంసన్‌తో పాటు మనీష్ పాండే, వృద్ధిమాన్ షా, దీపక్ హుడా, యూసుఫ్ పఠాన్‌లు బ్యాంటింగ్ లైనప్‌లో ఉన్నారు. కాగా వరుస విజయాలతో జట్టు కోచ్ టీమ్ మూడీ కూడా సంతృప్తిగానే ఉన్నాడు.