క్రీడాభూమి

సన్‌రైజర్స్ అభిమానులకు శుభవార్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 4: వెన్ను నొప్పితో బాదపడుతున్న భువనేశ్వర్ కుమర్ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో శనివారం జరిగే మ్యాచ్‌లో అందుబాటులో ఉంటాడని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ చెప్పాడు. గత కొన్ని రోజుల నుంచి వెన్ను నొప్పితే బాదపడిన భువనేశ్వర్ రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. అతనికి తగిలిన గాయం అంత తీవ్రమైనది కాదని, శనివారం జరిగే మ్యాచ్‌కు భువీ సిద్దం కాగలడన్న నమ్మకం ఉందని కేన్ పేర్కోన్నాడు. భువనేశ్వర్ జట్టులో అడకున్న సన్‌రైజర్స్ బౌలర్లు సమిష్టిగా రాణించి జట్టు విజయానికి కృషి చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ జట్టు, చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు పాయింట్ల పట్టికలో ఆగ్రస్థానంలో కొనసాగుతుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో సన్‌రైజస్ హైదరాబాద్ జట్టు మెరుగుపడాల్సి ఉందని కోచ్ టామ్ మోడీ తెలిపాడు.