క్రీడాభూమి

ముంబయి ఘన విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, మే 4: ముంబయి ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో ప్రత్యర్థి కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై ఘనవిజయం సాధించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా శుక్రవారం ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. జట్టులో బ్యాటింగ్‌లో రాణించిన క్రిస్ గేల్ 40 బంతుల్లో ఆరు బౌండరీలు, రెండు సిక్సర్లతో 50 పరుగులతో ఆర్థ సెంచరీ, కేఎల్ రాహుల్ 24, నాయర్ 21 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ 19 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసి విజయ లక్ష్యాన్ని అధిగమించింది. జట్టు బ్యాటింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ 57 పరుగులతో అర్థ సెంచరీ సాధించగా, ఇషాన్ కిషన్ 25, హార్తిక్ పాండ్యా 23 పరుగులు చేయగా కెప్టెన్ రోహిత్ శర్మ 24, కృనాల్ పాడ్య 31 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
అర్జున అవార్డుకు మన్‌ప్రీత్, సవిత
న్యూఢిల్లీ, మే 4: భారత హాకీ జట్టు మిడ్‌ఫీల్డర్లు మన్‌ప్రీత్ సింగ్, ధరమ్ సింగ్, మహిళా గోల్ కీపర్ సవిత పేర్లను అర్జున అవార్డుకు ప్రతిపాదిస్తూ భారత హాకీ సమాఖ్య సిఫారసు చేసింది. భారత మాజీ ఆటగాడు సంగై ఇబెంహల్ చాను, మాజీ కెప్టెన్ భరత్ చెత్రి పేర్లను జీవిత సాఫల్య పురస్కారం ధ్యాన్‌చంద్ అవార్డుకు, కోచ్ బీఎస్.చౌహాన్ పేరును ద్రోణాచార్య అవార్డు కోసం భారత హాకీ సమాఖ్య ప్రతిపాధించింది.
ప్లే ఆఫ్ మ్యాచ్‌ల వేదికలు మార్పు
కోల్‌కతా, మే 4: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్- 11 షెడ్యూల్ వేదికల్లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎలిమినేటర్, క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లను మహారాష్ట్ర క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో పుణే మైదానంలో నిర్వహించాల్సి ఉంది. ఆయితే రెండు మ్యాచ్‌ల వేదికలను కోల్‌కతాలోని ఈడెన్ కార్డెన్స్‌కు తరలిస్తూ శుక్రవారం ఐపీఎల్ పాలకమండలి ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ఈనెల 23, 25 తేదీల్లో ఎలిమినేటర్, క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లు కోల్‌కతా జరుగుతాయని గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ రాజీవ్ శుక్లా స్పష్టం చేశాడు. పుణే స్టేడియం కన్నా చరిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ సామర్థ్యం ఎక్కువగా ఉండటంతో ఐపీఎల్ పాలకమండలి ఈ మరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈడెన్ గార్డెన్ స్టేడియంలో 67వేల మంది మ్యాచ్‌ను వీక్షించేందుకు అవకాశం ఉంది. మే 27న ఐపీఎల్ టోర్నమెంట్‌కు సంబంధించిన ఫైనల్ మ్యాచ్ కూడా ఇక్కడే జరుగనుంది. తొలుత ఎలిమినేటర్, క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లకు చెన్నై సూపర్ కింగ్స్ హోంగ్రౌండ్ చపాక్ స్టేడియం ఆతిథ్యమివ్వాల్సీ ఉండగా, కావేరీ జలాల వివాదంతో ఆ జట్టు సొంతమైదానంగా పుణెలో ఆడుతున్న విషయం విదితమే.
డే నైట్ టెస్టు ఆడలేం: భారత్
ముంబయి, మే 4: ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత్ డే నైట్ టెస్ట్ మ్యాచ్ అడదని స్పష్టం చేసింది. గులాబీ బంతుల నాణ్యతపై అనుమానాలున్న నేపథ్యంలో డే నైట్ టెస్ట్ తమకు నేపథ్యంలో డే నైట్ టెస్ట్ తమకు ఆమోదయోగ్యం కాదని క్రికెట్ పాలక మండలి(సీఓఏ) తేల్చిచెప్పింది. ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ డే నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడటంలేదు. ఇందులవో ఎలాంటి అనుమానాలు లేవని సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ పేర్కొన్నాడు. డిసెంబర్ ఆరు నుంచి అడిలైడ్‌లో జరుగనున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో గులాబీ బంతితో నిర్వహించాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తోంది.