క్రీడాభూమి

కోహ్లీకి అత్యల్ప వేతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 4: భారత క్రికెట్ జట్టుతో అత్యధిక వేతనం అందుకుంటున్న క్రికెటర్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆగ్రస్థానంలో ఉంటాడు. బీసీసీఐ అందిస్తున్న వేతనంతో పాటు యాడ్‌ల ద్వారా కోహ్లీ అందరికంటే ఎక్కువ డబ్బులు అర్జించాడు. ఇతర క్రికెటర్‌ల మాదిరి కాకుండా విరాట్ కోహ్లీ ప్రతీ సంవత్సరం రూ.150 కోట్ల వరకు సంపాదిస్తున్నాడు. ఇంగ్లండ్ పర్యటనకు ముందు విరాట్ అక్కడి స్థానిక కౌంటీ క్రికెట్‌లో సుర్రే జట్టు తరపున ఆడనున్నాడు. బీసీసీఐ చేసిన తాజా ప్రకటనతో కోహ్లీ కౌంటీ క్రికెట్‌లో ఆడుతున్నందున నామమాత్రంగా డబ్బులు తీసుకుంటున్నాడు. కోహ్లీ తీసుకుంటున్న వేతనం గురించి బీసీసీఐ ఏలాంటి ప్రకటన చేయబోదు అనేది నిజం. అయితే ఓ సాధారణ కౌంటీ ప్లేయర్ తీసుకుంటున్నట్లుగా తక్కువ మొత్తాన్ని తీసుకుంటున్నాడు. ఇది కేవలం సుర్రేతో బీసీసీఐ చేసుకున్న డీల్ అని తెలిసింది. దేశావలి క్రికెట్‌తో పాటు కౌంటీ క్రికెట్‌లో భారత స్టార్ ఆటగాళ్లు ఆడాలని బీసీసీఐ సంకల్పించింది. విరాట్ అక్కడ ఆడేందుకు బీసీసీఐ వారం రోజుల్లో ఒప్పందం చేసుకోనుంది. ప్రధానంగా విరాట్ కోహ్లీ సుర్రేలో ఆడటం వాళ్లకు ఎంతో అనుకూలించనుంది. అతనికి ఫ్లైట్ ఛార్జీలు, బసతో పాటు ఒక నెల రోజుల పాటు వేతనం చెల్లిస్తుంది. విరాట్‌కు ఫ్లైట్ ఛార్జీలు, బసతో పాటు ఒక నెల రోజులపాటు వేతనం చెల్లిస్తుందని బీసీసీఐ అధికారి తెలిపాడు. ఐపీఎల్ ముగిసిన తర్వాత విరాట్ జూన్ 1న బయలు దేరానున్నాడు. రాయల్ లండన్ కప్‌లో కోహ్లీ రెండు, మూడు మ్యాచ్‌ల్లో పాల్గొంటాడు. మిడిల్స్, గ్లామోర్గాన్ జట్లతోతలపడిన అనంతరం విరాట్ జూన్ 20 నుంచి 23 వరకు సొమెర్‌సెట్‌తో, జూన్ 35 నుంచి 28 వరకు జరుగనున్న చివరి మ్యాచ్‌లో యాక్‌షైర్‌తో తలపడతాడు.