క్రీడాభూమి

నమ్మకం నిలుపుకోవడానికి ఎంతో కృషి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్‌బోర్న్, మే 4: టాంపరింగ్ కుంభకోణంలో, కోల్పోయిన ప్రతిష్ఠను పునరుద్దరించుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తామని, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తెలిపారు. ఈ కుంభకోణం తర్వాత తనకోసం ఎంతో సానుభూతి వ్యక్తమైందని, తన అభిమానులు తనపై ఉంచిన విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. మళ్లీ ఆస్ట్రేలియా జట్టులోకి రావాలన్న కోర్కె బలంగా ఉన్నదని, పెర్కొన్నారు. టీంలోకి వెనక్కి రావడానికి ఇది సరైన సమయమన్నారు. ‘నాకు వచ్చిన ఈ-మెయిల్స్, ఉత్తరాల ద్వారా అనేక మంది అభిమానులు తెలిపిన మద్దతును ఎన్నటికీ మరచిపోలేను. మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలుపుకునేందుకు చాలా కష్టపడాలి’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. టాంపరింగ్ వ్యవహారంలో ఈ బ్యాట్స్‌మన్ ఏడాది నిషేధం ఎదుర్కొంటున్నాడు. ఈతని వల్ల వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, ఓపెనర్ కామెరాన్ బన్‌క్రాఫ్ట్‌లు సస్పెన్షన్‌ను ఎదురు చూస్తున్నారు. సౌతాఫ్రికా మ్యాచ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత విమానాశ్రయంలో ఉద్వేగంతో కన్నీరు మున్నీరైన తర్వాత స్మిత్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ఇదే ప్రథమం. ‘విపత్కర పరిస్థితిలో అమ్మ, నాన్న, భార్య అందించిన మద్దతు మరువలేనిది. ప్రపంచంలో కుటుంబాన్ని మించిందేమీ లేదు, మీ ప్రేమాభిమానాలకు ఎంతో కృతజ్ఞతలు’ అని పేర్కొన్నాడు. సౌతాఫ్రికా జట్టుతో కేప్‌టౌన్‌లో జరిగిన మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్ చేశారన్న ఆరోపణలు రుజువు కావడంతో స్మిత్‌పై వేటుపడింది. బాల్ ట్యాంపరింగ్ ప్లాన్ వార్నర్‌ది. ఫలితంగా స్మిత్, వార్నర్‌లు ఇద్దరూ భారత ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ఆడకుండా నిషేధించారు. సాండ్ పేపర్‌తో బాల్‌ను టాంపరింగ్ చేసిన బాన్ క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలల నిషేధం విధించారు.