క్రీడాభూమి

సైనా, సింధూ వజ్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 5: భారత బాడ్మింటన్ సత్తాను ప్రపంచానికి చాటిన స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ.సింధు వజ్రంలాటి వారని, తన దృష్టిలో ఇద్దరూ ఒక్కటేనని కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నాడు. భవిష్యత్తులో భారత్‌కు బాడ్మింటన్‌లో మరిన్ని పతకాలు వస్తాయని, ఈ విషయంలో వారిద్దరూ మరింత దృష్టి సారించాలని సూచించాడు.
ఫిక్కీ మహిళా విభాగం సంస్థ ‘గోల్డెన్ గర్ల్స్ ఆఫ్ బాడ్మింటన్’ పేరుతో వారిని ఇక్కడ ఘనంగా సత్కరించింది. సైనా, సింధూ ప్రపంచ స్థాయి క్రీడాకారిణులుగా ఎదగడానికి కృషి చేసిన కోచ్ పుల్లెల గోపీచంద్‌ను కూడా సంస్థ నిర్వాహకులు సన్మానించారు. ఇటీవల కామనె్వల్త్ క్రీడల్లో సైనా నెహ్వాల్ స్వర్ణ పతకం సాధించగా, సింధు రజత పతకం గెలుచుకుంది. ఫిక్కీ మహిళా సంస్థ అధ్యక్షురాలు పింకీ రెడ్డి, సీనియర్ క్రీడా పాత్రికేయుడు బొరియా మజుందార్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో గోపీచంద్ మాట్లాడుతూ రాబోయే ఒలింపిక్స్‌లో బాడ్మింటన్‌లో పతకాలు సాధిస్తామని సింధు, సైనా స్పష్టం చేశారు.
బాడ్మింటన్ అంటేనే చైనా క్రీడాకారిణులే గుర్తుకు వచ్చేదని, బాడ్మింటన్ క్రీడలో భారత్‌కు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చారని ఫిక్కీ మహిళా సంస్థ అధ్యక్షురాలు పింకీ రెడ్డి పేర్కొంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఇష్టాగోష్టిలో సైనా, సింధు, గోపీచంద్ విద్యార్థులు, చిన్నారులతో అభిరుచులను పంచుకున్నారు.