క్రీడాభూమి

ఎదురులేని సన్‌రైజర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 5: రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఈ జట్టులో పృథ్వీ షా అత్యధిక పరుగులు (65) చేశాడు. తొలుత టాస్ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్ ఎంచుకుంది. గ్లెన్ మాక్స్‌వెల్ మూడు బంతులు ఎదుర్కొని కేవలం రెండు పరుగులు చేసి ఓపెనర్‌గా ఔటై నిరాశపరిచాడు. మరో ఓపెనర్‌ఘా దిగిన పృథ్వీ షా 36 బంతులు ఎదుర్కొని మూడు సిక్సర్లు, ఆరు బౌండరీల సహాయంతో 65 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో సిద్ధార్థ కౌల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు.
కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 36 బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్లు, మూడు బౌండరీల సహాయంతో 44 పరుగులు చేసి కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. సిద్ధార్థ కౌల్ బౌలింగ్‌లో శిఖర్ ధావన్‌కు క్యాచ్ ఇచ్చిన అయ్యర్ వెనుతిరిగాడు. నమన్ ఓజా నాలుగు బంతులు ఎదుర్కొని కేవలం ఒక పరుగు చేసి రనౌట్ అయ్యాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ 19 బంతులు ఎదుర్కొని ఒక బౌండరీతో 18 పరుగులు చేసి ఎల్బీడబ్ల్యూ అయ్యాడు.
విజయ్ శంకర్ 13 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, మరో బౌండరీతో 23 పరుగులు, డేనియల్ క్రిస్టియన్ తొమ్మిది బంతులు ఎదుర్కొని ఏడు పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. సన్‌రైజర్స్ బౌలర్లలో రషీద్ ఖాన్ నాలుగు ఓవర్లలో 23 పరుగులిచ్చి రెండు వికెట్లు, సిద్ధార్థ కౌల్ నాలుగు ఓవర్లలో 37 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నారు. అనంతరం ప్రత్యర్థి తమ ముందు ఉంచిన 164 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన హైదరాబాద్ ఇంకా ఒక బంతి మిగిలి ఉండగానే ఏడు వికెట్లు కోల్పోయి ఘనవిజయం సాధించింది.
వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న సన్‌రైజర్స్ మరోసారి తన సత్తాను చాటి ఐపీఎల్‌లో ఎదురులేని జట్టుగా ఆవిర్భవించింది. హైదరాబాద్ జట్టులో అలెక్స్ హేల్స్ 31 బంతులు ఎదుర్కొని మూడు సిక్సర్లు, మరో మూడు బౌండరీల సహాయంతో 45 పరుగులు చేసి అమిత్ మిశ్రా బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. శిఖర్ ధావన్ 30 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, రెండు బౌండరీలతో 33 పరుగులు చేసి అమిత్ మిశ్రా బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. మనీష్ పాండే 17 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లతో 21 పరుగులు చేసి ప్లంకెట్ బౌలింగక్‌లో పృథ్వీ షాకు క్యాచ్ ఇచ్చాడు. కెప్టెన్ కనే విలియమ్‌సన్ 30 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్‌తో 32 పరుగులు, యూసుఫ్ పఠాన్ 12 బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్లు, మరో రెండు ఫోర్లతో 27 పరుగులు చేసి జట్టును గెలిపించారు. ఢిల్లీ బౌలర్లలో అమిత్ మిశ్రాకు రెండు వికెట్లు, ప్లంకెట్‌కు ఒక వికెట్ దక్కింది. బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు 16 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది.