క్రీడాభూమి

అలవోకగా ప్లే ఆఫ్‌కు చెన్నై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణె, మే 5: ఇక్కడి మైదానంలో శనివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ అలవోగా విజయం సాధించింది. ఆరు వికెట్ల తేడాతో బెంగళూరుపై గెలుపొంది తమ ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసుకుంది. ప్లే ఆఫ్ బరిలో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో బెంగళూరు చతికిలపడింది. ఇక ఈ జట్టు తమ తదుపరి ఐదు మ్యాచ్‌లలో మెరుగైన రన్‌రేట్‌తో గెలిచేందుకు ఏదైనా అద్భుతం సృష్టిస్తే తప్ప మనుగడ కొనసాగడం కష్టమే. చెన్నైపై ఓటమితో కోహ్లీ సేన ఆశలు దాదాపు ఆవిరైనట్టే. చెన్నై జట్టులో స్పిన్నర్ల ద్వయం రవీంద్ర జడేజా, హర్బజన్ సింగ్ వరుసగా మూడు, రెండు వికెట్లు పడగొట్టి కోహ్లీ సేన ఎక్కువ పరుగులు చేయకుండా తమ స్పిన్ మాయాజాలంతో కట్టడి చేశారు. తొలుత టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్‌ను ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌ను ప్రారంభించిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. ఈ జట్టులో వికెట్ కీపర్ పృథ్వీ షా, టిమ్ సౌథీ మినహా కెప్టెన్ విరాట్ కోహ్లీ సహా బ్యాట్స్‌మెన్‌లెవరూ రెండంకెల స్కోరును సాధించడంలో చతికిలపడ్డారు. ఓపెనర్‌గా బ్రెండన్ మెక్‌కల్లమ్ మూడు బంతులు ఎదుర్కొని ఒక బౌండరీతో ఐదు పరుగులు చేసి ఎన్గిడి బౌలింగ్‌లో ఎస్.ఎన్.్ఠకూర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 11 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్‌తో ఎనిమిది పరుగులు చేసి రవీంద్ర జడేజా చేతిలో బౌల్డ్ అయ్యాడు. కొన్ని మ్యాచ్‌ల విరామం తర్వాత జట్టులోకి వచ్చిన ఏబీ డివిలియర్స్ నాలుగు బంతులు ఎదుర్కొని కేవలం ఒక పరుగు మాత్రమే చేసి హర్భజన్ సింగ్ బౌలింగ్‌లో ధోనీ చేతిలో స్టంపవుట్ అయ్యాడు. 13 బంతులు ఎదుర్కొన్న మన్‌దీప్ సింగ్ రవీంద్ర 13 బంతులు ఎదుర్కొని ఒక పరుగు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో విల్లీకి క్యాచ్ ఇచ్చాడు. వికెట్ కీపర్ పృథీ పటేల్ 41 బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్లు, ఐదు బౌండరీల సహాయంతో 53 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. రెండు బంతులు ఎదుర్కొని ఒక పరుగు చేసిన మురుగన్ అశ్విన్ హర్బజన్ సింగ్ బౌలింగ్‌లో స్టంపవుట్ అయ్యాడు. కొలిన్ డి గ్రాండ్‌హోమ్ ఎనిమిది బంతులు ఎదుర్కొని ఒక బౌండరీతో ఎనిమిది పరుగులు చేసి విల్లీ బౌలింగ్‌లో సురేష్ రైనాకు క్యాచ్ ఇచ్చాడు. ఉమేష్ యాదవ్ ఐదు బంతులు ఎదుర్కొని కేవలం ఒక పరుగు చేసి రనౌట్ అయ్యాడు. మహ్మద్ సిరాజ్ ఏడు బంతుల ఎదుర్కొని మూడు పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. టిమ్ సౌథీ 26 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, మూడు ఫోర్లతో 36 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు ఓవర్లలో 18 పరుగులిచ్చి మూడు వికెట్లు, హర్బజన్ సింగ్ నాలుగు ఓవర్లలో 22 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకున్నారు. డేవిడ్ విల్లీ నాలుగు ఓవర్లలో 24 పరుగులు, ఎన్గిడి నాలుగు ఓవర్లలో 24 పరుగులిచ్చి చెరో వికెట్ సాధించారు.
అనంతరం ప్రత్యర్థి తమ ముందు ఉంచిన 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సునాయాసంగా గెలుపుతీరాలకు చేరుకుంది. 18 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసి విజయం సాధించింది. షేన్ వాట్సన్ 14 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లతో 11 పరుగులు చేసి ఉమేష్ యాదవ్ చేతిలో బౌల్డ్ అయ్యాడు. 21 బంతులు ఎదుర్కొన్న సురేష్ రైనా ఒక సిక్సర్, రెండు ఫోర్లతో 25 పరుగులు చేసి ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో సౌథీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. అంబటి రాయుడు 25 బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్లు, మరో మూడు బౌండరీల సహాయంతో 32 పరుగులు చేసి మురుగన్ అశ్విన్ బౌలింగ్‌లో సిరాజుద్దీన్‌కు క్యాచ్ ఇచ్చాడు. ధృవ్ షోరే తొమ్మిది బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్‌తో ఎనిమిది పరుగులు చేసి గ్రాండ్‌హోమ్ బౌలింగ్‌లో మన్‌దీప్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుకకు వెళ్ళాడు. వికెట్ కీపర్/కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 23 బంతులు ఎదుర్కొని మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 31 పరుగులు, డ్వేన్ బ్రేవో 17 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్‌తో 14 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. ఇక బెంగళూరు జట్టులో ఉమేష్ యాదవ్ మూడు ఓవర్లలో 15 పరుగులిచ్చి రెండు వికెట్లు, కొలిన్ డి గ్రాండ్‌హోమ్ నాలుగు ఓవర్లలో 16 పరుగులిచ్చి ఒక వికెట్, మురుగన్ అశ్విన్ మూడు ఓవర్లలో 17 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నారు.
సంక్షిప్త స్కోరు:
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 127. (పృథ్వీ పటేల్ సి అండ్ బి రవీంద్ర జడేజా 53, టిమ్ సౌథీ నాటౌట్ 36, రవీంద్ర జడేజా 3/18, హర్బజన్ సింగ్ 2/22).
చెన్నై సూపర్ కింగ్స్: 18 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 128. (అంబటి రాయుడు సి సిరాజుద్దీన్ బి మురుగన్ అశ్విన్ 32, సురేష్ రైనా సి టిమ్ సౌథీ బి ఉమేష్ యాదవ్ 25, ఎం.ఎస్.్ధని నాటౌట్ 31, ఉమేష్‌యాదవ్ 2/15).