క్రీడాభూమి

స్పిన్నర్లూ..శెభాష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణె, మే 5: తమ జట్టు ప్లే ఆఫ్ ఆశలు సజీవం చేయడంలో అద్భుతంగా రాణించిన స్పిన్నర్ల ద్వయం రవీంద్ర జడేజా, హర్బజన్ సింగ్‌లను చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎం.ఎస్.్ధనీ ప్రశంసించాడు. శనివారం ఇక్కడ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో చెన్నై గెలవడంలో కీలక పాత్ర పోషించిన వారిద్దరిపై ధోని ప్రశంసలు కురిపించగా, మరోపక్క క్యాచ్‌లను పట్టుకోవడంలో తమ జట్టు సభ్యుల వైఫల్యాన్ని బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ తప్పుపట్టాడు. రవీంద్ర జడేజా, హర్బజన్ సింగ్ తమ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించారని అన్నాడు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ వికెట్లను పడగొట్టి ప్రత్యర్థి ఎక్కువ పరుగులు తీయకుండా అడ్డుకునేందుకు హర్బజన్ సింగ్ సమర్థవంతమైన పాత్రను పోషించాడని, ఇది తమకెంతో కలసి వచ్చిందని ధోనీ అన్నాడు. తమ జట్టు అద్భుతంగా బౌలింగ్ చేసిందని ఆయన అన్నాడు. చెన్నై పరుగులు చేయలేక సతమవుతున్న దశలో అందివచ్చిన డ్రేన్ బ్రేవో బ్యాటింగ్‌లో క్యాచ్‌లను పృథ్వీ పటేల్, యుజ్వేంద్ర చాహల్ జారవిడవడం పట్ల విరాట్ కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అందివచ్చిన క్యాచ్‌లను అనవసరంగా జారవిడవడం వల్ల ప్రత్యర్థి పుంజుకోడానికి ఆస్కారం ఇచ్చినట్లయిందని ఆయన అభిప్రాయపడ్డాడు. మ్యాచ్ తొలి అర్ధ్భాగం వరకు తాము అద్భుతంగా ఆడామని, కానీ అందివచ్చిన మంచి అవకాశాలను జారవిడుచుకోవడంతో ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని ఆయన అన్నాడు. ఈ మ్యాచ్‌లో తాము పేసర్లతోపాటు స్పిన్నర్లకు పని అప్పగించామని, ఇది బాగా వర్కవుట్ అయిందని చెన్నై కెప్టెన్ ధోనీ అన్నాడు. డెత్ ఓవర్లలో స్పెషలిస్టు డ్వేన్ బ్రేవోను కూడా ఉపయోగించుకున్నామని, అతనికి ప్రతిసారీ నాలుగు ఓవర్లు అవసరం లేదని అన్నాడు. తాము ఇంతవరకూ ఆడిన అన్ని మ్యాచ్‌లలో దాదాపు ప్రతి బౌలర్ తమ పాత్ర పరిధి మేరకు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారని ధోనీ అన్నాడు. మరోవైపు కోహ్లీ మాట్లాడుతూ ధోనీ సేన బాగా ఆడిందని, విజయానికి వారు అర్హులని అన్నాడు. ఈ మ్యాచ్ చాలా టఫ్‌గా నడిచిందని, తమకు ఇంకా మిగిలిన నాలుగైదు మ్యాచ్‌లలో విజయం సాధించాల్సి ఉంటుందని, ఆ దిశగా కృషి చేస్తామని పేర్కొన్నాడు.