క్రీడాభూమి

రాజస్తాన్ వెన్నువిరిచిన ముజీబ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, మే 6: ఇక్కడి హోల్కర్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ బౌలర్ ముజీబ్ ఉర్ రహ్మాన్ ప్రత్యర్థి వెన్నువిరిచాడు. దీంతో పంజాబ్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్‌ను ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌ను ప్రారంభించిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఓపెనర్‌గా దిగిన డీ ఆర్సీ షార్ట్ నిరాశపరిచాడు. రెండు బంతులు ఎదుర్కొన్న షార్ట్ కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి రవిచంద్ర అశ్విన్ బౌలింగ్‌లో ఆండ్రూ టైకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. కెప్టెన్ అజింక్య రహానే ఐదు పరుగులు చేసి అక్సర పటేల్ బౌలింగ్‌లో క్రిస్ గేల్‌కు క్యాచ్ ఇచ్చాడు. సంజూ శాంసన్ 23 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, మరో రెండు బౌండరీల సహాయంతో 28 పరుగులు చేశాడు. బెన్ స్టోక్స్ 12 పరుగులు చేసి ముజీబ్ ఉర్ రహ్మాన్ బౌలింగ్‌లో మనోజ్ తివారీకి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. వికెట్ కీపర్ జోస్ బట్లర్ 39 బంతులు ఎదుర్కొని ఏడు బౌండరీలతో 51 పరుగులు చేసి ముజీబ్ ఉర్ రహ్మాన్ బౌలింగ్‌లో రాహుల్‌కు త్రిపాఠికి క్యాచ్ ఇచ్చాడు. జోప్రా ఆర్చెర్ ఒక బంతిని ఎదుర్కొని బౌల్డ్ అయ్యాడు. కృష్ణప్ప గౌతమ్ ఐదు పరుగులు చేసి రాజ్‌పుఠ్ బౌలింగ్‌లో స్టోయినిస్‌కు క్యాచ్ ఇచ్చాడు. రాహుల్ త్రిపాఠి 1 11 పరుగులు చేసి ఆండ్రూ టై బౌలింగ్‌లో రవిచంద్రన్ అశ్విన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. శ్రేయాస్ గోపాల్ 16 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లతో 24 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. జయదేవ్ ఉనద్కత్ ఏడు బంతులు ఎదుర్కొని ఆరు పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రహ్మాన్ నాలుగు ఓవర్లలో 27 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఆండ్రూ టై నాలుగు ఓవర్లలో 24 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ ప్రత్యర్థి తమ ముందు ఉంచిన 153 పరుగుల లక్ష్య ఛేదనకు దిగి ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు కోల్పోయ 155 పరుగులు చేసి విజయం సాధించింది. వికెట్ కీపర్ లోకేష్ రాహుల్ 54 బంతులు ఎదుర్కొని మూడు సిక్సర్లు,, ఏడు బౌండరీలతో చెలరేగి 84 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. క్రిస్ గేల్ ఎనిమిది పరుగులు చేసి నిరాశపరిచాడు. మయాంక్ అగర్వాల్ రెండు పరుగులు చేసి బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో రాహుల్ త్రిపాఠికి క్యాచ్ ఇచ్చాడు. కరణ్ నాయర్ 23 బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్లు, రెండు ఫోర్ల సహాయంతో 31 పరుగులు చేసి బౌల్డ్ అయ్యాడు. అక్షర పటేల్ ఐదు బంతులు ఎదుర్కొని నాలుగు పరుగులు చేసి కృష్ణప్ప గౌతమ్ బౌలింగ్‌లో డి ఆర్సీ షార్ట్‌కు క్యాచ్ ఇచ్చాడు. మార్కస్ స్టోయనిస్ 23 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.