క్రీడాభూమి

దక్షిణాసియా జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, మే 6: ఇక్కడ జరుగుతున్న మూడవ దక్షిణాసియా జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌ను భారత్ 20 గోల్డ్‌మెడల్స్‌తో ముగించింది. తొలుత 11 గోల్డ్‌మెడల్స్ సాధించిన భారత అథ్లెట్లు ఆదివారం జరిగిన వివిధ విభాగాల్లో తొమ్మిది పతకాలు సాధించారు. మొత్తం ఏడు దేశాల అథ్లెట్లు పాల్గొన్న ఈ చాంపియన్‌షిప్‌లో భారత్ పతకాల పంట పండించింది. మొత్తం 20 గోల్డ్, 22 కాంస్య, 8 రజత పతకాలతో ముందుంది. ఆతిధ్య దేశం శ్రీలంక 12 గోల్డ్, 10 కాంస్య, 19 రజత పతకాలు, పాకిస్తాన్ ఒక కాంస్య, ఒక రజత పతకం సాధించి వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. భారత జూనియర్ అథ్లెట్లు పోటీల చివరి రోజున న్యూ మీట్ రికార్డ్సు (ఎన్‌ఎంఆర్)ను తిరగరాశారు. ముఖ్యంగా బాలికల ట్రిపుల్ జంప్‌లో ప్రియదర్శిని సురేష్ గోల్డ్ మెడల్‌తోపాటు 12.90 మీటర్లతో సరికొత్త రికార్డును లిఖించింది. బాలికల జావెలిన్ త్రో ఈవెంట్‌లో సంజన చౌదరి 48.08తో అగ్రస్థానంలో నిలిచింది. అదేవిధంగా బాలికల డిస్కస్ త్రో విభాగంలో అర్పన్‌దీప్ కౌర్ మూడో అథ్లెట్‌గా నిలచి గోల్డ్‌మెడల్‌తోపాటు 48.06తో కొత్త రికార్డు తిరగరాసింది. ఇక బాలుర షాట్‌పుట్ అంశంలో ఆశిష్ భలోతియా కొత్త రికార్డు సృష్టించి 18.53మీటర్లతో గోల్డ్ మెడల్ సాధించాడు. ట్రిపుల్ జంపర్ కమల్‌రాజ్ కనగరాజ్ 15.96 మీటర్ల జంప్‌లో గోల్డ్‌మెడల్‌తో రికార్డు సృష్టించాడు. అదేవిధంగా భారత బాలలు, బాలికలు 400 మీటర్ల రిలేలో కాంస్య పతకాలు సాధించారు. కాగా, ఈ పోటీల్లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లు జూన్ 7-10 తేదీల మధ్య జపాన్‌లోని గిఫులో నిర్వహించే 18వ ఆసియన్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తారు.