క్రీడాభూమి

చెత్త ఫీల్డింగ్‌తో ఢిల్లీ ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 6: అంతర్జాతీయ స్థాయి క్రికెట్ టీ-20 ఫార్మట్‌లో నిర్వహించే మ్యాచ్‌ల్లో గెలవాలంటే జట్టు సమష్టి కృషితో పాటు ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించినపుడే సాధ్యమవుతుంది. క్యాచ్‌గా చేతికి అందిన బంతిని పొరపాటున వదిలినా భారీ మూల్యం చెల్లించుకోవడం ఖాయం. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ హేల్స్, యూసుఫ్ పఠాన్ క్యాచ్‌లను చేజార్చుకున్న ఢిల్లీ జట్టు ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఓటమిపాలైంది. తనకు అంది అవకాశాన్ని ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ హేల్స్ సద్వినియోగం చేసుకుని, ఆ తర్వాత ప్రీహిట్‌లో అవేష్ ఖాన్ బౌలింగ్‌లో మూడు సిక్సర్లు కొట్టాడు. మిస్ ఫీల్డింగ్ అనేది ఒకానొక క్రమంలో మ్యాచ్ స్థితిగతులను మార్చేయగలదని ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రే అన్నాడు. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ ఘనవిజయం సాధించింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు సిక్సర్లు కొట్టి జట్టు విజయానికి హేల్స్ పటిష్ట పునాది వేయగలిగాడన్నాడు. మ్యాచ్ 17వ ఓవర్ల సమయంలో నువ్వా నేనా అన్నట్లు కొనసాగుతుండగా పఠాన్ క్యాచ్‌ను విజయ్‌శంకర్ జారవిడిచాడు. పఠాన్‌కు లైఫ్ రావడంతో ఢిల్లీ జట్టు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చిందన్నాడు. పఠాన్ క్యాచ్ పట్టి ఉంటే జీరోతో పెవిలియన్ పట్టేవాడు. చేతికి అందిన బంతిన విడిచిపెట్టడంతో 12 బంతుల్లో 27 పరుగులు చేసి పరుగులు చేసి పలువురిని అకట్టుకున్నాడు. ఈ రెండు క్యాచ్‌లు జారవిడవడంతో ఢిల్లీ జట్టు ఓటమికి ప్రధాన కారణమని కోచ్ ఆమ్రే వివరించాడు. కాగా, ఫీల్డర్ క్యాచ్ జారవిడచడంతో జట్టు ఓపెనర్ 31 బంతుల్లో 45 పరుగులు సాధించాడు. ఢిల్లీ జట్టు చేసిన తప్పిదాలను ఆసరా చేసుకుని సైన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు సద్వినియోగం చేసుకోవడంతో విజయం వారి వశమైందన్నారు. బౌలర్ భువనేశ్వర్ కుమార్ చక్కటి లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్‌ను వేసి ఢిల్లీ జట్టులో విలువైన వికెట్లు తీసుకుని జట్టు విజయానికి ప్రధాన పాత్ర పోషించాడు.