క్రీడాభూమి

బలమైన సన్‌రైజర్స్‌తో బెంగళూరు పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 6: ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో బలీయమైన శక్తితో వరుస విజయాలను తమ ఖాతాలో నమోదు చేసుకుంటున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆపసోపాలు పడుతూ దాదాపు ప్లే ఆఫ్‌కు ఆశలు సన్నగిల్లే దశలో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సోమవారం తలపడనుంది. మొత్తం ఎనిమిది జట్లలో ఇప్పటికే అగ్రస్థానాన్ని ఆక్రమించిన సన్‌రైజర్స్ ఇంతవరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో ఏడింట్లో విజయం సాధించింది. కేవలం రెండు మ్యాచ్‌లలోనే ఓటమిపాలైన ఈ టీమ్ 14 పాయింట్లతో తొలి స్థానాన్ని ఆక్రమించింది. ఇక ఐపీఎల్ జట్లలో ఆరో స్థానంలో నిలిచిన విరాట్ కోహ్లీ సేన ఇంతవరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో కేవలం మూడింట్లోనే గెలిచింది. ఆరు మ్యాచ్‌లలో ఓటమిని ఎదుర్కొన్న ఈ టీమ్ కేవలం ఆరు పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఏరకంగా చూసుకున్నా బెంగళూరు కంటే హైదరాబాద్ జట్టు చాలావరకు మెరుగ్గానే ఉంది. శనివారం స్వంత మైదానంలో ఢిల్లీ డేర్ డెవిల్స్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన సన్‌రైజర్స్ దాదాపు ప్లే ఆఫ్‌కు చేరుకున్నట్టే. కానీ టోర్నమెంట్‌కు ముందు తలపడే మిగిలిన ప్రత్యర్థి జట్ల నుండి ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదు. ఈ జట్టు ఇంకా ఆరు మ్యాచ్‌లను ఆడాల్సి ఉంటుంది. వీటిల్లో కూడా ఇటు బౌలింగ్, అటు బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిస్తే సన్‌రైజర్స్ ‘విన్’రైజర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. ఈ టీమ్‌లో ఓపెనర్, స్టయిలిష్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్‌తోపాటు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌ల స్టయికింగ్ రేటు మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉంది. స్పిన్నర్ రషీద్ ఖాన్, పేసర్లు సిద్ధార్థ కౌల్, సందీప్ శర్మ, స్పిన్ ఆల్‌రౌండర్ షాకీబ్ అల్ హసన్ వంటివారు ఇటీవల ఆడిన మ్యాచ్‌లలో సమర్థవంతమైన పాత్రను పోషించారు. ఢిల్లీతో శనివారం జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన అలెక్స్ హేల్స్‌తోపాటు శిఖర్ ధావన్ తమ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్న విషయం తెలిసిందే. కెప్టెన్ కనే విలియమ్‌సన్ ఈ సీజన్‌లో అత్యధిక పరుగులతో కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడడం కూడా జట్టుకు కలిసొచ్చే అదృష్టం.
ఇక బెంగళూరుకు నేతృత్వం వహిస్తున్న విరాట్ కోహ్లీ సేన ఆడబోయే తదుపరి మ్యాచ్‌లన్నీ జీవన్మరణ సమస్యతో ముడిపడి ఉన్నట్టే. ఈ టీమ్ ఇప్పటివరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో కేవలం మూడు మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఈ జట్టు ఇంకో ఐదారు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్న నేపథ్యంలో ప్రతి మ్యాచ్‌లోనూ గెలవాల్సిన అవసరం ఉంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప బెంగళూరు దాదాపు ప్లే ఆఫ్‌కు చేరుకోవడం కష్టమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఓటమిని చవిచూసిన ప్రతి మ్యాచ్‌లోనూ టీమ్‌లోని బ్యాట్స్‌మెన్‌లకంటే బౌలర్లు, ఫీల్డర్ల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని గత మ్యాచ్‌లో ఓటమి తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీనే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. సోమవారం సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌లో కోహ్లీ, డివిలియర్స్ స్థిరంగా నిలబడితే ప్రత్యర్థిని నిలువరించవచ్చు. అదేవిధంగా చెన్నైతో జరిగిన గత మ్యాచ్‌లో పృథ్వీ పటేల్ 53 పరుగులు చేశాడు. అదేవిధంగా ఉమేష్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, మెక్‌కల్లమ్, మన్‌దీప్ సింగ్, కొలిన్ గ్రాండ్‌హోమ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్ వంటివారు కూడా ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్‌లో మెరుస్తారని కెప్టెన్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. భువనేశ్వర్ కుమార్ ఈ జట్టుకు బౌలింగ్‌లో బలమైన ఆయుధం. హైదరాబాద్ బ్యాట్స్‌మెన్‌లను భువీ నిలువరించగలిగితే, అతనికి తోడు మిగిలిన బౌలర్లు కూడా కొంత చేయూతనందిస్తే చాలావరకు మేలు జరుగుతుంది.