క్రీడాభూమి

మెరిసిన ముంబయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 6: సూర్యకుమార్ యాదవ్ అర్ధ సెంచరీ, హార్థిక్ పాండ్య ఆల్‌రౌండ్ ప్రదర్శన కలగలసి ముంబయి 13 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఘన విజయం సాధించింది. తమ స్వంత మైదానంపై ఆదివారం కోల్‌కతాతో జరిగిన పోరులో ముంబయి గెలవడంతో మరో విజయాన్ని తమ ఖాతాలో నమోదు చేసుకున్నా ఎనిమిది పాయింట్లతో ఐదో స్థానానికే పరిమితమైంది. తొలుత టాస్ గెలిచిన కోల్‌కతా బౌలింగ్‌ను ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌ను ప్రారంభించిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. ముంబయి జట్టులో ఓపెనర్లుగా దిగిన సూర్యకుమార్ యాదవ్, ఎవిన్ లూయిస్ మంచి శుభారంభం అందించారు. వీరిద్దరూ జట్టులో అత్యధిక పరుగులు చేశారు. ఓపెనర్‌గా దిగిన ఎవిన్ లూయిస్ 28 బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్లు, మరో ఐదు ఫోర్ల సహాయంతో 43 పరుగులు చేశాడు. ఆండ్రూ రస్సెల్ బౌలింగ్‌లో క్రిస్ లీన్‌కు క్యాచ్ ఇచ్చిన ఎవిన్ లూయిస్ వెనుతిరిగాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 11 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్‌తో 11 పరుగులు చేసి సునీల్ నరైన్ బౌలింగ్‌లో రింకూ సింగ్‌కు క్యాచ్ ఇచ్చాడు. 39 బంతులు ఎదుర్కొన్న సూర్యకుమార్ యాదవ్ రెండు సిక్సర్లు, ఏడు బౌండరీల సహాయంతో 59 పరుగుల చేసి ఆండ్రూ రస్సెల్ బౌలింగ్‌లో దినేష్ కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. కృణాల్ పాండ్య 11 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, మరో ఫోర్‌తో 14 పరుగులు చేసి సునీల్ నరైన్ బౌలింగ్‌లో శుభ్‌మాన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. 20 బంతులు ఎదుర్కొన్న హార్థిక్ పాండ్య ఒక సిక్సర్, నాలుగు బౌండరీల సహాయంతో 35 పరుగులు, జీన్ పాల్ డుమినీ 11 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్‌తో 13 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. కోల్‌కతా బౌలర్లలో సునీల్ నరైన్ నాలుగు ఓవర్లలో 35 పరుగులిచ్చి రెండు వికెట్లు, ఆండ్రూ రస్సెల్ రెండు ఓవర్లలో 12 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకున్నారు.
అనంతరం ప్రత్యర్థి తమ ముందు ఉంచిన 182 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన కోల్‌కతా ఆరు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఈ జట్టులో ఓపెనర్లుగా దిగిన క్రిస్ లీన్, శుభ్‌మాన్ గిల్ శుభారంభాన్ని తీసుకురాకున్నా మిడిలార్డర్‌లో ముగ్గురు జట్టును ఆదుకున్నారు. 13 బంతులు ఎదుర్కొన్న క్రిస్ లీన్ నాలుగు ఫోర్లతో 17 పరుగులు చేసి మెక్‌క్లీన్‌గన్ బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. శుభ్‌మాన్ గిల్ ఐదు బంతులు ఎదుర్కొని ఒక బౌండరీతో ఏడు పరుగులు చేసి హార్థిక్ పాండ్య బౌలింగ్‌లో కృణాల్ పాండ్యకు క్యాచ్ ఇచ్చాడు. 35 బంతులు ఎదుర్కొన్న రాబిన్ ఉతప్ప మూడు సిక్సర్లు, మరో ఆరు బౌండరీల సహాయంతో 54 పరుగులు చేశాడు. మార్కండేయ బౌలింగ్‌లో బెన్ కటింగ్‌కు క్యాచ్ ఇచ్చి ఉతప్ప వెనుతిరిగాడు. నితీష్ రాణా 27 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, మూడు బౌండరీల సహాయంతో 31 పరుగులు చేసి హార్థిక్ పాండ్య బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. ఆండ్రూ రస్సెల్ 10 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్‌తో తొమ్మిది పరుగులు చేసి జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో కృణాల్ పాండ్యకు క్యాచ్ ఇచ్చాడు. సునీల్ నరైన్ నాలుగు బంతులు ఎదుర్కొని ఒక బౌండరీతో ఐదు పరుగులు చేసి కృణాల్ పాండ్య బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. కెప్టెన్/వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ 26 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, మరో ఐదు ఫోర్ల సహాయంతో 36 పరుగులు, పీయూష్ చావ్లా పరుగులేమీ చేయకుండానే నాటౌట్‌గా నిలిచారు. ముంబయి బౌలర్లలో హార్థిక్ పాండ్య నాలుగు ఓవర్లలో 19 పరుగులిచ్చి రెండు వికెట్లు, మెక్‌క్లీన్‌గన్ నాలుగు ఓవర్లలో 30 పరుగులు, జస్ప్రీత్ బుమ్రా నాలుగు ఓవర్లలో 34 పరుగులు, కృణాల్ పాండ్య మూడు ఓవర్లలో 29 పరుగులు, మయాంక్ మార్కండే మూడు ఓవర్లలో 25 పరుగులిచ్చి తలో వికెట్ సాధించారు.
సంక్షిప్త స్కోరు
ముంబయి ఇండియన్స్: 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 181 (సూర్యకుమార్ యాదవ్ సి దినేష్ కార్తీక్ బి ఆండ్రూ రస్సెల్ 59, ఎవిన్ లూయిస్ సి క్రిస్ లీన్ బి ఆండ్రూ రస్సెల్ 43, హార్థిక్ పాండ్య నాటౌట్ 35, ఆండ్రూ రస్సెల్ 2/12, సునీల్ నరైన్ 2/35).
కోల్‌కతా నైట్ రైడర్స్: 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 168 పరుగులు (రాబిన్ ఉతప్ప సి బెన్ కటింగ్ బి మార్కండే 54, దినేష్ కార్తీక్ నాటౌట్ 36, నితీష్ రాణా సి జస్ప్రీత్ బుమ్రా బి హార్థిక్ పాండ్య 31, హార్థిక్ పాండ్య 2/19).

ఆసియా పసిఫిక్ వెల్టర్ వెయిట్ టైటిల్‌పై నీరజ్ గోయాట్ కన్ను
న్యూఢిల్లీ, మే 6: ప్రపంచ బాక్సింగ్ కౌన్సిల్ (డబ్ల్యుబీసీ) ఆధ్వర్యంలో వచ్చే నెలలో కెనడాలో జరుగనున్న ఆసియా పసిఫిక్ వెల్టర్ వెయిట్ విభాగంలో పతకం సాధించేందుకు భారత బాక్సర్ నీరజ్ గోయాట్ సిద్ధమవుతున్నాడు. ఇప్పటివరకు నీరజ్‌జ్ 13 ప్రొఫెషనల్ టోర్నమెంట్‌లలో గెలుపొందాడు. ఆసియా పసిఫిక్ బాక్సింగ్ పోటీలో ఈసారి తప్పకుండా విజయం సాధించాలని పట్టుదలతో ఉన్న నీరజ్ రెండేళ్లపాటు లీ బ్యాక్స్‌టేర్ ప్రమోషన్స్ సంస్థతో ఒప్పందం కుదురుచుకున్నాడు. కెనడాలో జూన్ 26 నుంచి పోటీలు జరుగుతాయి. కెనడాకు చెందిన సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న భారత క్రీడాకారుల్లో తానే మొదటివాడినని, ఇది తన కెరీర్‌కు ఎంతో ఉపయోగపడుతుందని నీరజ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.