క్రీడాభూమి

డే అండ్ నైట్ మ్యాచ్ ఆడేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 7: ఈ ఏడాది ఆఖరులో ఆస్ట్రేలియా నిర్వహించే డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌లలో టీమిండియా ఆడేది లేదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) స్పష్టం చేసింది. ఈ మేరకు ఆస్ట్రేలియా క్రికెట్‌కు ఒక లేఖ ద్వారా తన నిర్ణయాన్ని వ్యక్తీకరించింది. ఆస్ట్రేలియా గత కొనే్నళ్లుగా పింక్ బాల్ టెస్టులో పాల్గొనాలని దాదాపు దేశాలను అభ్యర్థిస్తోంది. డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌లు ఆడాలంటే టీమిండియా జట్టు అందుకు అన్నివిధాల సంసిద్ధంగా ఉండాలని, ఇందుకు కనీసం 18 నెలలైనా సమయం కావాలని చీఫ్ కోచ్ రవి శాస్ర్తీ కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ)కు తెలియజేశాడు. ఇదే విషయాన్ని ఉటంకిస్తూ కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ యాక్టింగ్ సెక్రెటరీ చౌదరి ఆస్ట్రేలియా క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జేమ్స్ సదర్లాండ్‌కు స్పష్టం చేశాడు. ‘అడెలైడ్‌లో ఈ ఏడాది డిసెంబర్ 6 నుంచి 10వ తేదీవరకు నిర్వహించే పింక్ బాల్ ఓపెనింగ్ టెస్టు మ్యాచ్‌లో ఆడాలని ఆస్ట్రేలియా క్రికెట్ కోరింది. ఒక ఏడాది కాలంలో భారత్ ఫార్మాట్‌లలో మాత్రమే ఆడుతుందని స్పష్టం చేశాను. ప్రస్తుత పరిస్థితుల్లో డే అండ్ టెస్టు మ్యాచ్‌లలో టీమిండియా ఆడడం అసాధ్యం’ అని ఆస్ట్రేలియా క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌కు తెలియజేసినట్టు ఆయన వివరించాడు. కాగా, స్వదేశీ మైదానంలో నిర్వహించిన ఏ డే అండ్ నైట్ మ్యాచ్‌లోనూ ఆస్ట్రేలియా ఓడిపోలేదు. ఇంకోవైపు టీమిండియా క్రికెటర్లలో ఛటేశ్వర పుజారా, మురళీ విజయ్ మాత్రమే ఇప్పటివరకు డే అండ్ నైట్‌గా జరిగిన పింక్ బాల్ మ్యాచ్ (దులీప్ ట్రోఫీ)లలో ఆడారు.

31న టీ-20 చారిటీ మ్యాచ్
న్యూఢిల్లీ, మే 7: కరేబియన్ ప్రాంతంలో గత ఏడాది హరికేన్ తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన బాధితులకు చేయూతనిచ్చేందుకు నిధుల సమీకరణ కోసం ఈనెల 31న వెస్టిండీస్‌తో ఐసీసీ వరల్డ్ ఎవెవెన్ పేరిట ట్వంటీ ట్వంటీ చారిటీ మ్యాచ్‌ను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఐసీసీ సోమవారం వెల్లడించింది. ఐసీసీ వరల్డ్ ఎలెవెన్‌ను ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ దీనికి నాయకత్వం వహించనున్నాడు. ట్వంటీ ట్వంటీ ఇంటర్నేషనల్‌గా పరిగణించే ఈ మ్యాచ్‌లో తాజాగా న్యూజిలాండ్‌కు చెందిన స్టార్ ఆటగాళ్లు వికెట్ కీపర్/బ్యాట్స్‌మన్ ల్యూక్ రోంచి, ఫాస్ట్ బౌలర్ మిచెల్ మెక్‌క్లీన్‌గన్ ఆడడం దాదాపు ఖాయమైంది. ఇంగ్లాండ్ టీమ్‌కు భారత్ క్రికెటర్లు హార్థిక్ పాండ్య, దినేష్ కార్తీక్‌తోపాటు పాకిస్తాన్‌కు చెందిన షాహిద్ ఆఫ్రిదీ, షోయబ్ మాలిక్, బంగ్లాదేశ్‌కు చెందిన షాకీబ్ అల్ హసన్, తమీమ్ ఇక్బాల్, శ్రీలంకకు చెందిన తిసర పెరీరా, అఫ్గనిస్తాన్‌కు చెందిన రషీద్ ఖాన్ ప్రాతినిధ్యం వహించనున్నారు. తాజాగా ఈ మ్యాచ్‌కు ప్రాతినిధ్యం వహించనున్నవారిలో ఒకడైన న్యూజిలాండ్ వికెట్ కీపర్/బ్యాట్స్‌మన్ ల్యూక్ రోంచి మాట్లాడుతూ తుఫాన్ ప్రభావిత ప్రాంతవాసులను ఆదుకునేందుకు నిర్వహించే చారిటీ మ్యాచ్‌లో ఆడేందుకు అవకాశం రావడంత గొప్పవిషయమని అన్నాడు.
ఈ చారిటీ మ్యాచ్‌లో ఆడేందుకు వివిధ దేశాల నుంచి ఎంతోమంది క్రికెటర్లు పాలుపంచుకోనున్నారని, వారితో కలసి ఆడడం తనకెంతో ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ మెక్‌క్లీన్‌గన్ సైతం దాదాపు ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. తుఫాను ప్రభావిత ప్రాంత ప్రజలను ఆదుకునేందుకు నిధుల సమీకరణకు చారిటీ మ్యాచ్ ద్వారా ఆడేందుకు ప్రపంచంలోని పలు దేశాల క్రికెటర్లు తగిన పాత్ర పోషించాలనుకోవడం గొప్ప విషమని అన్నాడు. ఐసీసీ వరల్డ్ ట్వంటీ ట్వంటీ చారిటీ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టుకు కార్లోస్ బ్రాత్‌వైట్ నాయకత్వం వహించనున్నాడు. క్రిస్ గేల్, మర్లోన్ శామ్యూల్స్, శామ్యూల్ బద్రీ, ఆండ్రూ రస్సెల్ వంటివారు ఈ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు.