క్రీడాభూమి

సన్‌రైజర్స్‌దే గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఐదు పరుగులతో బెంగళూరు ఓటమి * చివరి వరకూ ఉత్కంఠ
హైదరాబాద్, మే 7: కెప్టెన్ ఒంటరి పోరాటం..అందని సహచరుల అండ..సింగిల్ డిజిట్‌కే పలువురి తిరుగుముఖం పట్టినా ఆట చివరిలో బ్యాట్స్‌మెన్‌లు, ఫీల్డర్లు చక్కటి వ్యూహంతో మరోసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి ఐపీఎల్‌లో విజయానికి బాటలు వేశారు. సోమవారం ఇక్కడ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఐదు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ చివరి వరకూ సాగిన ఉత్కంఠలో చివరకు విజయం సన్‌రైజర్స్‌నే వరించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్ జట్టులో బ్యాట్స్‌మెన్‌లు అంతగా రాణించకపోవడంతో భారీ స్కోరు సాధించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులకే సన్‌రైజర్స్ ఆలౌటైంది. బెంగళూరు బౌలర్లు టిమ్ సౌథీ, మహ్మద్ సిరాజ్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్‌లు అత్యధిక పరుగులు చేయకుండా అడ్డుకున్నారు. వీరిద్దరూ చెరో మూడు వికెట్లు సాధించారు. తొలుత టాస్ గెలిచిన కోహ్లీ సేన బౌలింగ్‌ను ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ ఓపెనర్లు తొందరగా ఔటై నిరాశపరిచారు. అలెక్స్ హేల్స్ ఐదు బంతులు ఎదుర్కొని ఒక బౌండరీతో ఐదు పరుగులు చేసి సౌథీ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. 19 బంతులు ఎదుర్కొన్న శిఖర్ ధావన్ ఒక బౌండరీతో 13 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్‌లో సౌథీకి క్యాచ్ ఇచ్చాడు. మనీష్ పాండే ఏడు బంతులు ఎదుర్కొని ఐదు పరుగులు చేసి యజ్వేంద్ర చాహల్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. 39 బంతులు ఎదుర్కొన్న కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ రెండు సిక్సర్లు, ఐదు బౌండరీల సహాయంతో 56 పరుగులు చేశాడు. ఎంతో ఊపుమీదున్న విలియమ్‌సన్ ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో మన్‌దీప్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. షాకీబ్ అల్ హసన్ 32 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లతో 35 పరుగులు చేసి, టిమ్ సౌథీ బౌలింగ్‌లో ఉమేష్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చాడు. యూసుఫ్ పఠాన్ ఏడు బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లతో 12 పరుగులు చేసి సిరాజ్ చేతిలో బౌల్డ్ అయ్యాడు. వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఐదు బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్‌తో ఎనిమిది పరుగులు చేసి సిరాజ్ చేతిలో బౌల్డ్ అయ్యాడు. రషీద్ ఖాన్ మూడు బంతులు ఎదుర్కొని ఒక పరుగు చేసి రనౌట్ అయ్యాడు. ఒక బంతిని ఎదుర్కొని ఒక పరుగు చేసిన సిద్ధార్థ కౌల్ సైతం రనౌట్ అయ్యాడు. సందీప్ శర్మ ఒక బంతిని ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే ఎల్‌బీడబ్ల్యూ అయ్యాడు. భువనేశ్వర్ కుమార్ రెండు బంతులు ఎదుర్కొని ఒక పరుగు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కాగా, బెంగళూరు బౌలర్లలో మహ్మద్ సిరాజ్ నాలుగు ఓవర్లలో 25 పరుగులిచ్చి మూడు, టిమ్ సౌథీ నాలుగు ఓవర్లలో 30 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకున్నారు. ఉమేష్ యాదవ్ నాలుగు ఓవర్లలో 36 పరుగులిచ్చి ఒకటి, యుజ్వేంద్ర చాహల్ నాలుగు ఓవర్లలో 25 పరుగులిచ్చి చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం ప్రత్యర్థి తమ ముందు ఉంచిన 147 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసి ఓటమిపాలైంది. చివరి వరకూ నువ్వా నేనా అన్న ఈ మ్యాచ్‌లో చివరి రెండు ఓవర్లు ఇరు జట్లకు కీలకంగా మారాయి. వికెట్ కీపర్ పృథ్వీ పటేల్ 13 బంతులు ఎదుర్కొని నాలుగు బౌండరీలతో 20 పరుగులు చేసి షాకీబ్ చేతిలో ఎల్‌బీడబ్ల్యూ అయ్యాడు. మనన్ వోహ్రా 10 బంతులు ఎదుర్కొని ఎనిమిది పరుగులు చేసి సందీప్ శర్మ చేతిలో బౌల్డ్ అయ్యాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 30 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, మరో ఐదు బౌండరీల సహాయంతో 39 పరుగులు చేసి షాకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో యూసుఫ్ పఠాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. ఏబీ డివిలియర్స్ ఎనిమిది బంతులు ఎదుర్కొని ఐదు పరుగులు చేసి రషీద్ ఖాన్ చేతిలో బౌల్డ్ అయ్యాడు. మొరుూన్ అలీ ఏడు బంతులు ఎదుర్కొని రెండు బౌండరీలతో 10 పరుగులు చేసి సిద్ధార్థ కౌల్ బౌలింగ్‌లో వృద్ధిమాన్ సాహాకు క్యాచ్ ఇచ్చాడు. కొలిన్ డి గ్రాండ్‌హోమ్ 29 బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్లు, ఒక బౌండరీతో 33 పరుగులు చేసి బౌల్డ్ అయ్యాడు. మన్‌దీప్‌సింగ్ 23 బంతులు ఎదుర్కొని ఒక బౌండరీతో 21 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.