క్రీడాభూమి

నిలకడగా ఆడడం ఇష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 7: నిలకడగా ఆడడం తనకెంతో ఇష్టమని ఇటీవల ఆస్ట్రేలియా గోల్డ్ కోస్ట్ కామనె్వల్త్ గేమ్స్‌లో ఎయిర్ పిస్టల్ విభాగంలో గోల్డ్‌మెడల్‌తోపాటు కాంస్య పతకం సాధించిన హీనా సిద్ధు తెలిపింది. జర్మన్‌లోని మ్యునిచ్‌లో ఈనెల 22 నుంచి 29వ తేదీవరకు ది ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ వరల్డ్ కప్‌లో పాల్గొనేందుకు వెళ్తున్న సందర్భగా ఆమె ఇక్కడ పీటీఐతో మాట్లాడింది. తాను ఏ విభాగంలో పోటీపడినా స్థిరంగా, నిలకడగా ఆడేందుకు ఎంతో ఇష్టపడతానని, దీనివల్ల ఫలితాలు ఆశాజనకంగా వస్తాయని ఆమె అభిప్రాయపడింది. 28 ఏళ్ల హీనా సిద్ధు కామనె్వల్త్ గేమ్స్‌లో 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్‌లో ఘనవిజయం సాధించడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పింది. అదేవిధంగా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో కాంస్య పతకం అందుకుంది. వరల్డ్ కప్‌లో పాల్గొనేందుకు వీలుగా తాను ఈనెల 8 నుంచి 21వ తేదీవరకు శిక్షణ పొందనున్నానని, ఈనెల 13న ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఉంటుందని ఆమె తెలిపింది. కామనె్వల్త్ గేమ్స్‌లో ఎంతో బాగా రాణించానని, అదేవిధంగా కొరియాలో జరిగిన వరల్డ్ కప్‌లోనూ సమర్థవంతంగా ఆటతీరును ప్రదర్శించానని ఆమె పేర్కొంది.
అయితే, కామనె్వల్త్ గేమ్స్ కంటే కొరియా వరల్డ్ కప్‌లో ఇంకా బాగా ఆడానని, కానీ పతకం సాధించలేకపోయానని వాపోయింది. ఒక సిరీస్‌లో ఒకటి, రెండు విజయాలు నమోదు చేసుకున్న తర్వాత ఓటమిని చవిచూస్తున్నానని, దీనిని ఎదుర్కొనేందుకు తగిన ప్రణాళికతో ముందుకు వెళ్తానని ఆమె ధీమా వ్యక్తం చేసింది. కాగా, హీనా సిద్ధు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌తో తన కెరీర్‌ను ప్రారంభించిందని, ఆ తర్వాత 25 మీటర్ల ఈవెంట్‌లో రాణించిందని, ఇపుడు కఠినమైన శిక్షణను సైతం ఎదుర్కొంటోందని ఆమె కోచ్, భర్త రొనాక్ పండిట్ అన్నాడు. ఇలా మూడు రకాల భిన్న పాత్రలను పోషించడం ఆశామాషీ కాదని ఆయన అభిప్రాయపడ్డాడు. త్వరలో జరుగనున్న ఆసియా గేమ్స్, వరల్డ్ చాంపియన్‌షిప్‌లో అత్యధిక స్కోరు సాధించడం హీనా సిద్ధు లక్ష్యమని ఆయన అన్నాడు.