క్రీడాభూమి

టీమిండియా కెప్టెన్‌గా రహానే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* కోహ్లీ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ * అఫ్గనిస్తాన్ టెస్ట్‌కు నేడు టీమిండియా జట్టు ఎంపిక
బెంగళూరు, మే 7: ముంబై వాంఖడే స్టేడియం వేదికగా అఫ్గనిస్తాన్ జట్టు చరిత్రలో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్థానంలో ప్రస్తుత టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్య రహానే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. టెస్ట్ ఫార్మాట్‌లో రహానే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి. గత సంవత్సరం ధర్మశాలలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌కి కోహ్లీ భుజం గాయం కారణంగా దూరం కావడంతో అతని స్థానంలో రహానే కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఆ టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపిన రహానే త్వరలో అఫ్గనిస్తాన్‌తో జరిగే టెస్ట్‌లో భారత్‌కు విజయాన్ని అందిస్తాడనే నమ్మకంతో అతనికి జట్టు కెప్టెన్ పగ్గాలు అప్పగించినట్టు తెలుస్తోంది.
ఇండియన్ ప్రీమియర్ క్రికెట్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్ అనంతరం టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కౌంటీ క్రికెట్ లీగ్‌లో పాల్గొనేందుకు ఇంగ్లాండ్ వెళ్లనున్నాడు. జూన్‌లో పూర్తిగా కోహ్లీ సుర్రే తరపున క్రికెట్ ఆడనున్నాడు. అయితే ఈ నెలలో టీం ఇండియాకు అఫ్గనిస్తాన్‌తో జరుగనున్న ఒక టెస్ట్ మ్యాచ్, ఇదే మాసంలో నెలాఖరులో ఇంగ్లాండ్‌తో ఐర్లాండ్ డబ్లిన్‌లో జరిగే రెండు అంతర్జాతీయ టీ-20 మ్యాచ్‌ల్లో కోహ్లీ పాల్గొనడం లేదు.
ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్-11లో అజింక్య రహానే రాజస్తాన్ రాయల్స్ జట్టులో (కెప్టెన్) ఆడుతున్నాడు. కాగా, కోహ్లీ స్థానంలో జట్టులోకి యువ క్రికెటర్, ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌ను తీసుకోనున్నారు. కోహ్లీతో పాటు పలువురు క్రికెటర్లకి ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతి కల్పిస్తున్నారు. రవీంద్ర జడేజాను జట్టు నుంచి తప్పించి అతని స్థానంలో అక్షర్ పటేల్, హార్థిక్ పాండ్యను తప్పించి అతని స్థానంలో విజయ్ శంకర్‌ను జట్టులోకి తీసుకోనున్నారు. వీరితోపాటు ప్రస్తుతం కౌంటీ క్రికెట్ అడుతున్న చతేశ్వర్ పుజారా, ఇశాంత్ శర్మ కూడా మే 14న భారత్‌కు చేరుకునే ఆవకాశం ఉంది. అఫ్గనిస్తాన్‌తో తలపడే టీమిండియా కెప్టెన్‌గా అజింక్య రహానే వ్యవహరించనుండగా, టీం బాధ్యతలు చేపట్టేందుకు ఇన్‌చార్జిగా రోహిత్ శర్మ వ్యవహరించనున్నాడు. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జూన్ 14 నుంచి అఫ్గనిస్తాన్‌తో జరిగే టెస్ట్ మ్యాచ్‌లో పాల్గొనే భారత్ జట్టును మంగళవారం బీసీసీఐ ప్రకటించనున్నది. యూకేలో జరుగనున్న పరిమిత ఓవర్ల క్రికెట్ టోర్నమెంట్, ఇంగ్లాండ్ టూర్‌లో పాల్గొననున్న భారత్-ఏ జట్టును జాతీయ సెలెక్షన్ కమిటీ సమావేశం అనంతరం జట్లను ప్రకటించనున్నారు. యువ క్రికెటర్‌లు పృథ్వీ షా, శుభ్‌మాన్ గిల్, శివం మావి ఇండియా-ఏ జట్టులో ఆడే అవకాశాలు అధికంగా కనపడుతున్నాయి. టీమిండియా-ఏ జట్టుకు రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు.