క్రీడాభూమి

జోస్ బట్లర్ జోష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* పంజాబ్‌పై 15 పరుగులతో రాజస్తాన్ గెలుపు * రాహుల్ లోకేష్ శ్రమ వృథా
జైపూర్, మే 8: జోస్ బట్లర్ ఒంటరి పోరాటం..అందని సహచర బ్యాట్స్‌మెన్‌ల సహకారం. సింగిల్ డిజిట్‌కే పలువురు పెవిలియన్ ముఖం పట్టిన వైనం. అయినా జట్టు ప్రత్యర్థిపై విజయం సాధించింది. ఇక్కడి మైదానంలో ఐపీఎల్‌లో భాగంగా కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో తలపడిన రాజస్తాన్ రాయల్స్ 15 పరుగులతో ఘన విజయం సాధించింది. పంజాబ్ బ్యాట్స్‌మెన్‌లలో లోకేష్ రాహుల్ శ్రమ వృథా అయింది. జట్టులోని మిగిలిన బ్యాట్స్‌మెన్‌లెవరూ సహకరించకపోవడంతో మ్యాచ్‌ను చేజేతులా పంజాబ్ జారవిడుచుకుంది. తొలుత టాస్ గెలిచిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో ఆండ్రూ టై అత్యధికంగా నాలుగు వికెట్లు తీసుకుని రాజస్తాన్ బ్యాట్స్‌మెన్‌లను కట్టడి చేశాడు. మ్యాచ్ ఆరంభంలోనే కెప్టెన్ అజింక్య రహానే రూపంలో తొలి వికెట్‌ను జారవిడుచుకుంది. 10 బంతులు ఎదుర్కొన్న రహానే ఒక బౌండరీతో తొమ్మిది పరుగులు చేసి ఆండ్రూ టై బౌలింగ్‌లో అక్షదీప్ నాథ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. కృష్ణప్ప గౌతమ్ ఆరు బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్‌తో ఎనిమిది పరుగులు చేసి స్టోయినిస్ బౌలింగ్‌లో మనోజ్ తివారీకి క్యాచ్ ఇచ్చాడు. సంజూ శాంసన్ 18 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, మరో బౌండరీతో 22 పరుగులు చేసి ముజీబ్ బౌలింగ్‌లో మనోజ్ తివారీకి క్యాచ్ ఇచ్చి వెనుకకు మరిలాడు. వికెట్ కీపర్ జోస్ బట్లర్ 58 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, తొమ్మిది బౌండరీలతో 82 పరుగులు చేసి ముజీబ్ బౌలింగ్‌లో స్టంపవుట్ అయ్యాడు. క్రీజులో ఉన్నంతసేపు బట్లర్ బౌండరీల వర్షం కురిపించాడు. ఏడు బంతులు ఎదుర్కొన్న స్టూవర్ట్ బిన్నీ ఒక సిక్సర్‌తో 11 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. బెన్ స్ట్రోక్స్ 11 బంతులు ఎదుర్కొని ఒక బౌండరీతో 14 పరుగులు చేసి ఆండ్రూ టై బౌలింగ్‌లో రవిచంద్రన్ అశ్విన్‌కు క్యాచ్ ఇచ్చాడు. జోఫ్రా ఆర్చెర్ ఒక బంతిని ఎదుర్కొని ఆండ్రూ టై బౌలింగ్‌లో మనోజ్ తివారి క్యాచ్ పట్టగా పెవిలియన్ దారిపట్టాడు. జయదేవ్ ఉనద్కత్ ఒక బంతిని ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే ఆండ్రూ టై బౌలింగ్‌లో కరణ్ నాయర్‌కు క్యాచ్ ఇచ్చాడు. మహీపాల్ లామ్‌రోర్ తొమ్మిది బంతులు ఎదుర్కొని ఒక బౌండరీతో తొమ్మిది పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక పంజాబ్ బౌలర్లలో ఆండ్రూ టై నాలుగు ఓవర్లలో 34 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. ముజీబ్ ఉర్ రహ్మాన్ నాలుగు ఓవర్లలో 21 పరుగులిచ్చి రెండు వికెట్లు, మార్కస్ స్టోయినిస్ రెండు ఓవర్లలో 15 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నారు.
అనంతరం ప్రత్యర్థి తమ ముందు ఉంచిన నిర్ణీత 159 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ ఏడు వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. ఈ జట్టులో సైతం వికెట్ కీపర్ (95 నాటౌట్)దే అత్యధిక స్కోరు కావడం విశేషం. కెప్టెన్ సహా మిగిలిన బ్యాట్స్‌మెన్‌లెవరూ పరుగులు తీయడంలో విఫలమై సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. విధ్వంసక బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ ఒక బంతిని ఎదుర్కొని ఒక పరుగు చేసి కృష్ణప్ప గౌతమ్ బౌలింగ్‌లో స్టంపవుట్ అయ్యాడు. కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ రెండు బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే బౌల్డ్ అయ్యాడు. కరణ్ నాయర్ ఐదు బంతులు ఎదుర్కొని మూడు పరుగులు చేసి జోఫ్రా ఆర్చెర్ బౌలింగ్‌లో జయదేవ్ ఉనద్కత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. అక్షదీప్ నాథ్ 13 బంతులు ఎదుర్కొని ఒక బౌండరీతో తొమ్మిది పరుగులు చేసి ఇష్ సోధి బౌలింగ్‌లో కృష్ణప్ప గౌతమ్‌కు క్యాచ్ ఇచ్చాడు. మనోజ్ తివారీ ఎనిమిది బంతులు ఎదుర్కొని ఏడు పరుగులు చేసి బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో అజింక్య రహానేకు క్యాచ్ ఇచ్చాడు. అక్షర్ పటేల్ ఐదు బంతులు ఎదుర్కొని ఒక ఫోర్‌తో తొమ్మిది పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. మార్కస్ స్టోయినిస్ 16 బంతులు ఎదుర్కొని 11 పరుగులు చేసి జయదేవ్ ఉనద్కత్ బౌలింగ్‌లో కృష్ణప్ప గౌతమ్‌కు క్యాచ్ ఇచ్చాడు. వికెట్ కీపర్ లోకేష్ రాహుల్ 70 బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్లు, 11 బౌండరీలతో 95 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆండ్రూ టై ఒక బంతిని ఎదుర్కొని ఒక పరుగు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రాజస్తాన్ బౌలర్లలో కృష్ణప్ప గౌతమ్‌కు రెండు వికెట్లు దక్కాయి. జోఫ్రా ఆర్చెర్, జయదేవ్ ఉనద్కత్, బెన్ స్టోక్స్, ఇష్ సోధిలకు చెరో వికెట్ దక్కాయి.