క్రీడాభూమి

భారత్ కాకపోతే శ్రీలంకతో డే నైట్ టెస్ట్ మ్యాచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, మే 8: టీమిండియా జట్టు ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా స్థానిక జరిగే టెస్ట్, వనే్డ మ్యాచ్‌ల్లో పాల్గొంటుంది. ఈ పర్యటనలో భాగంగా భారత్ జట్టు టెస్ట్ సిరీస్‌కు ఆతిథ్యమిస్తున్న ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇందులో భాగంగా భారత్ జట్టు ఆస్ట్రేలియాతో ఒక డై అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడాలని క్రికెట్ ఆస్ట్రేలియా కోరింది. అయితే, ఈ ఏడాది ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా తాము డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడే ప్రసక్తి లేదని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టం చేస్తూ లేఖ కూడా రాసిన విషయం తెలిసిందే. ఈ మేరకు బీసీసీఐ అమితాబ్ చౌదరి డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడలేమని క్రికెట్ ఆస్ట్రేలియాకు స్పష్టం చేశాడు. ఈ లేఖకు స్పందించిన క్రికెట్ ఆస్ట్రేలియా, బీసీసీఐ నుంచి తమకు లేఖ అందిన విషయం వాస్తవమేనని, డే నైట్ టెస్ట్ మ్యాచ్ కోసం తాము చేసిన ప్రతిపాదనకు వారు సిద్ధంగా లేరని పేర్కొన్నాడు. అయితే టెస్ట్ క్రికెట్‌పై ఏలాంటి ప్రభావం కోల్పోకుండా, స్వదేశీ గడ్డపై వేసవిలో ఆస్ట్రేలియా ఆడే టెస్ట్ సిరీస్‌లో కనీసం ఒక్క టెస్ట్ అయినా డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ ఆడాలని నిర్ణయించినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఛీప్ సదర్లాండ్ తెలిపాడు. భారత పర్యటన అనంతరం శ్రీలంక జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఆస్ట్రేలియా కొనే్నళ్లుగా తమ దేశానికి వస్తున్న జట్లతో ఒక టెస్ట్‌ను డే అండ్ నైట్‌గా ఆడుతోంది. ఇందులో భాగంగా డిసెంబర్ 6 నుంచి అడిలైట్‌లో ప్రారంభం కానున్న టెస్ట్ సిరీస్‌లోని తొలి టెస్ట్‌ను గులాబీ బంతితో ఆడాలని సీఏ భారత్‌ను కోరింది. డే నైట్ టెస్ట్ ఆడలేకపోడానికి సంబంధించిన కారణాలు తెలుపుతూ బీసీసీఐ కార్యదర్శి ఈ మెయిల్ ద్వారా సీఏ సీఈఓ సదర్లాండ్‌కు పూర్తి వివరాలు తెలియజేశాడు. బీసీసీఐ నిర్ణయంతో డే నైట్ టెస్ట్ మ్యాచ్ నిర్వహించాలనుకున్న ఆస్ట్రేలియా ఆశలకు నీళ్లు చల్లినట్లయింది. బీసీసీఐ ఈ మొయిల్‌కు స్పందించిన సదర్లాండ్ అడిలైట్ వేదికగా డిసెంబర్ 6 నుంచి 10 తేదీల్లో భారత, ఆస్ట్రేలియా మధ్య ప్రారంభమయ్యే టెస్ట్ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం పగటిపూటే మ్యాచ్ జరుగుతుందని మంగళవారం ప్రకటించాడు.

ఆధిపత్యం కోసం కోల్‌కతా
నేడు ముంబయితో మ్యాచ్
కోల్‌కతా, మే 8: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్ బుధవారం తన స్వంత మైదానంలో పోటీపడే ముంబయి ఇండియన్స్‌పై ఆధిపత్యం కోసం అర్రులు చాస్తోంది. ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభమైన నాటినుంచి ఇప్పటివరకు (11 సీజన్‌లు) ఈ రెండు టీమ్‌లు 21సార్లు పరస్పరం తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లలో కోల్‌కతాదే పైచేయిగా నిలిచింది. ఈ టీమ్ 17 సార్లు ముంబయిపై విజయ బావుటా ఎగురవేసింది.
ఇంతవరకు ఏ జట్టుతోనూ కోల్‌కతా 21సార్లు తలపడిన దాఖలాలు లేవు. ప్రస్తుత సీజన్‌లోని ఎనిమిది జట్లలో దినేష్ కార్తీక్ నేతృత్వంలోని కోల్‌కతా నాలుగో స్థానంలో నిలిచింది. ఇంతవరకు 10 మ్యాచ్‌లు ఆడిన ఈ టీమ్ ఐదు మ్యాచ్‌లలో గెలుపొంది, మరో ఐదు మ్యాచ్‌లలో ఓడిపోయి 10 పాయింట్లు సాధించింది. ఐదో స్థానంలో ఉన్న రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబయి ఇంతవరకు 10 మ్యాచ్‌లు ఆడింది. నాలుగు మ్యాచ్‌లలో విజయం సాధించిన ఈ టీమ్ ఆరు మ్యాచ్‌లలో ఓటమిని చవిచూసింది. ఎనిమిది పాయింట్లు దక్కించుకుంది. ఈనెల ఆరో తేదీన వాంఖడే స్టేడియంలో ముంబయితో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 13 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఏవిధంగా చూసుకున్నా ఈ రెండు జట్లూ దాదాపు సమఉజ్జీలుగా ఉన్నా కోల్‌కతా ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లలో విజయం సాధించడంతో ఈ జట్టు ఇంకా మరో నాలుగు మ్యాచ్‌లలో ఆడాల్సి ఉంటుంది. ముంబయి కేవలం నాలుగు మ్యాచ్‌లలో విజయం సాధించడం, ఈ టీమ్‌కు కూడా మరో నాలుగు మ్యాచ్‌లలో ఆడే అవకాశం ఉండడంతో ప్లే ఆఫ్‌కు చేరుకోవాలంటే కోల్‌కతా కంటే ముంబయి ప్రత్యర్థితో తలపడే మిగిలిన అన్ని మ్యాచ్‌లలోనూ అత్యధిక రన్‌రేట్‌తో గెలుపొందాల్సిన అవసరం ఉంది.
ఒకవిధంగా చెప్పాలంటే ముంబయికి మిగిలిన మ్యాచ్‌లన్నీ చాలా కీలకం అని చెప్పక తప్పదు. అయితే, కోల్‌కతా కూడా ఇంకా మరో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నా ప్లే ఆఫ్‌కు చేరుకోవాలంటే మెరుగైన రన్ రేటుకోసం ప్రయత్నించాల్సి ఉంది. కోల్‌కతాలో సునీల్ నరైన్ ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్‌లోనూ సమర్థవంతమైన పాత్రను పోషిస్తుండడం, కీలక సమయాల్లో చురుకుగా వ్యవహరిస్తుండడం జట్టుకు కలిసివచ్చే అంశం. అయితే, జట్టులోని మిగిలిన బౌలర్లు ముఖ్యంగా పేసర్లు కూడా తగిన పాత్ర వహిస్తే ప్రత్యర్థిని కట్టడి చేయవచ్చునని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. జట్టులోని దిగ్గజ ఆటగాళ్లు మిచెల్ జాన్సన్, టామ్ కురన్, ఆండ్రూ రస్సెల్, శివం మావి, రాబిన్ ఉతప్ప, నితీష్ రాణా వంటివారి సహకారం ఎంతో అవసరం. ఇక ముంబయి జట్టులో హార్థిక్ పాండ్య ఇటు బౌలింగ్, అటు బ్యాటింగ్‌లోనూ రాణిస్తూ జట్టును ఆదుకుంటున్నాడు.
ఇంతవరకు తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన హార్థిక్ పాండ్య 14 వికెట్లు తీసుకున్నాడు. తన చురుకైన, పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థి టీమ్‌లోని బ్యాట్స్‌మెన్‌లకు చెమటలు పట్టించగల సత్తా అతనిలో ఉంది. అదేవిధంగా బెన్ కటింగ్, స్పెషలిస్టు బౌలర్ ముస్త్ఫా ఫిజుర్ వంటివారు ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణిస్తే ముంబయిని ప్లే ఆఫ్ దశకు తీసుకువెళ్లగలరు.

‘సన్’ రైజింగ్ హైదరాబాద్
ఇపుడు అందరి నోళ్లలోనూ సన్‌రైజర్స్ మాటే. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసుకుని, ఆ తర్వాత రెండు మ్యాచ్‌లలో ఓటమిపాలైనా అసంతృప్తి చెందలేదు. పడిలేచిన కెరటంలా అప్రతిహతంగా దూసుకుపోతోంది. మొత్తం ఎనిమిది టీమ్‌లు ఉన్నా, వీటిలో కొన్ని బలమైన జట్లు ఉన్నా, వెరవకుండా ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్‌లో రాకెట్‌లా దూసుకుపోతోంది. కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ నేతృత్వం జట్టుకు ప్రధాన బలమైతే, సమర్థవంతమైన బౌలర్లుగా వినుతికెక్కిన రషీద్ ఖాన్, షాకీబ్ అల్ హసన్, భువనేశ్వర్ కుమార్, సిద్ధార్థ కౌల్‌తోపాటు బ్యాట్స్‌మెన్లు శిఖర్ ధావన్, యూసుఫ్ పఠాన్, మనీష్ పాండే వంటి వారు ప్రధాన బలగం.