క్రీడాభూమి

ఇంగ్లాండ్ పర్యటనకు ఆసీస్ కెప్టెన్‌గా టిమ్ పైన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, మే 8: బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో కళ్లు తెరిచిన క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) జట్టును మరింత పటిష్టం చేసే దిశలో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగానే జట్టుకు నూతన కోచ్‌గా జస్టిన్ లాంగర్‌ను ఇటీవల నియమించింది. గతంలో ఆసీస్ టీం సభ్యులు చేసిన తప్పిదాలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన నిబంధనలను అమలు చేస్తోంది క్రికెట్ ఆస్ట్రేలియా. బాల్ ట్యాంపరింగ్‌తో క్రికెట్ ఆస్ట్రేలియా స్టీవ్ స్మిత్‌పై ఏడాది పాటు నిషేధం విధించింది. దీంతో ఆసీస్ జట్టు కెప్టెన్‌ను కోల్పోయింది. అయితే జూన్‌లో ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా ఐదు వనే్డలు, ఒక టీ-20 మ్యాచ్‌లో ఆడనుంది. ఈ పర్యటనలో వనే్డ సిరీస్‌కు ఆసీస్ సారథిగా టిమ్ పైన్‌ను ఎంపిక చేసినట్టు జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ పేర్కొన్నాడు. బాల్ ట్యాంపరింగ్ సంఘటన అనంతరం దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి టెస్ట్‌కు టిమ్ పైన్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు.
దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం ఆస్ట్రేలియా జట్టు జూన్‌లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళుతుంది. 15 మంది సభ్యులు కలిగిన ఆసీస్ వనే్డ జట్టుకు కెప్టెన్‌గా వికెట్ కీపర్ పైన్‌ను, వైస్ కెప్టెన్‌గా అరోన్ ఫించ్‌ను ఎంపిక చేసినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా సెలెక్టర్స్ కమిటీ చైర్మన్ వెల్లడించాడు. 2019లో వరల్డ్ కప్ ఇంగ్లాండ్‌లో జరుగుతుండటంతో ప్రస్తుత పర్యటన ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పాడు. మరోవైపు ఏకైక టీ-20 మ్యాచ్‌కు కెప్టెన్‌గా అరోన్ ఫించ్ నాయకత్వం వహిస్తాడని ఆయన పేర్కొన్నాడు.