క్రీడాభూమి

ఇంగ్లాండ్ వనే్డ సిరీస్‌లో రాయుడు, అయ్యర్‌కు చోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 8: టీమిండియా త్వరలో జరుగనున్న వివిధ సిరీస్‌లలో పాల్గొనే జట్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెలక్షన్ కమిటీ మంగళవారం ప్రకటించింది. అఫ్గనిస్తాన్‌తో జరిగే ఏకైక టెస్ట్ మ్యాచ్, ఐర్లాండ్‌తో జరుగనున్న రెండు టీ-20ల సిరీస్, ఇంగ్లాండ్‌తో జరుగనున్న మూడు టీ-20ల సిరీస్, మూడు వనే్డల సిరీస్‌లకుగాను టీమిండియా జట్టు సభ్యులను చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఇంగ్లాండ్ వనే్డ సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో అంబటి రాయుడు, అయ్యర్‌లకు చోటు దక్కగా, టీ-20లో సిద్ధార్థ కౌల్‌కు భారత జట్టులో చోటు దక్కింది. అఫ్గనిస్తాన్‌తో జరుగనున్న చారిత్రక టెస్ట్ మ్యాచ్‌కు భారత రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కౌంటీ మ్యాచ్‌ల్లో పాల్గొనేందుకు ఇంగ్లాండ్ వెళుతున్న సందర్భంగా ఆయన స్థానంలో జట్టు కెప్టెన్‌గా అజింక్య రహానేను ఎంపిక చేసింది. ఐర్లాండ్‌తో జరిగే రెండు టీ-20ల సిరీస్‌తో పాటు ఇంగ్లాండ్‌తో జరిగే వనే్డ, టీ-20 సిరీస్‌ల్లో సిద్ధార్థ కౌల్‌కు బెర్త్ ఖాయమైంది. గతంలో శ్రీలంకతో జరిగిన వనే్డ సిరీస్‌లో కౌల్‌కు చోటుదక్కినప్పటికీ మ్యాచ్‌లో ఆడే అవకాశం రాలేదు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడుతున్న కౌల్ అద్భుతంగా రాణిస్తుండటంతో టీమిండియా జట్టులోకి మరోసారి పిలుపు అందింది. పరిమిత ఓవర్ల సిరీస్‌లో తలపడే భారత జట్టుకు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. జూన్ 14న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో భారత్-అఫ్గనిస్తాన్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. జూలై 3 నుంచి ఇంగ్లాండ్‌తో టీ-20 సిరీస్ నిర్వహించనున్నారు. విధంగా వనే్డ సిరీస్ జూలై 12వ తేదీ నుంచి ప్రారంభం కానున్నది.
జట్ల వివరాలు:
* అఫ్గనిస్తాన్ ఏకైక టెస్ట్ మ్యాచ్ జట్టు: అజింక్య రహానే (కెప్టెన్), శిఖర్ ధావన్, మురళీ విజయ్, కేఎల్ రాహుల్, చటేశ్వర్ పుజారా, కరుణ్ నాయర్, సాహా, అశ్విన్, జడేజా, కుల్దీప్ యాదవ్, ఉమేష్ యాదవ్, షమీ, హార్థిక్ పాండ్య, ఇషాంత్ శర్మ, శార్ధూల్ ఠాకూర్.
* ఐర్లాండ్ టీ-20 సిరీస్ జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కేఎల్.రాహుల్, సురేష్ రైనా, మనీష్ పాండే, ఎంఎస్.్ధనీ, దినేశ్ కార్తీక్, చాహల్, కుల్దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, హార్థిక్ పాండ్య, సిద్ధార్థ కౌల్, ఉమేష్ యాదవ్.
* ఇంగ్లాండ్ టీ-20 సిరీస్ జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కేఎల్.రాహుల్, శ్రేయాస్ అయ్యర్, అంబటి రాయుడు, ఎంఎస్.్ధనీ, దినేశ్ కార్తీక్, చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, హార్థిక్ పాండ్య, సిద్ధార్థ కౌల్, ఉమేశ్ యాదవ్.