క్రీడాభూమి

ఛేదనలో చతికిలపడిన కోల్‌కతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మే 9: ముంబయి మళ్లీ భారీ స్కోరు చేసింది. బుధవారం ఇక్కడి ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ 102 పరుగులతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన కోల్‌కతా బౌలింగ్‌ను ఎంచుకోవడంతో బ్యాటింగ్‌కు దిగిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అద్భుత ఇన్నింగ్ ఆడాడు. కేవలం 21 బంతుల్లోనే 62 పరుగులు (ఆరు సిక్సర్లు, మరో ఐదు బౌండరీలు) చేశాడు. ఓపెనర్ ఎవిన్ లూయిస్ 13 బంతులు ఎదుర్కొని మూడు బౌండరీలతో 18 పరుగులు చేసి పీయూష్ చావ్లా బౌలింగ్‌లో క్రిస్ లీన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. మరో ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్ 32 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, ఐదు ఫోర్లతో 36 పరుగులు చేసి పీయూష్ చావ్లా బౌలింగ్‌లో రింకూ సింగ్‌కు క్యాచ్ ఇచ్చాడు. వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ 21 బంతులు ఎదుర్కొని ఆరు సిక్సర్లు, ఐదు ఫోర్లతో 62 పరుగులు చేశాడు. మంచి ఊపులో ఉన్న కిషన్ నరైన్ బౌలింగ్‌లో రాబిన్ ఉతప్ప క్యాచ్‌కు దొరికిపోయాడు. హార్థిక్ పాండ్య 13 బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్లతో 19 పరుగులు చేసి టామ్ కరణ్ బౌలింగ్‌లో రింకూ సింగ్‌కు క్యాచ్ ఇచ్చాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 31 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, మరో రెండు బౌండరీల సహాయంతో 36 పరుగులు చేశాడు. ప్రసీధ్ బౌలింగ్‌లో రాబిన్ ఉతప్పకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. బెన్ కటింగ్ తొమ్మిది బంతులు ఎదుర్కొని మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 24 పరుగులు చేసి పీయూష్ చావ్లా బౌలింగ్‌లో ఆండ్రూ రస్సెల్‌కు క్యాచ్ ఇచ్చాడు. కృణాల్ పాండ్య రెండు బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్‌తో ఎనిమిది పరుగులు చేశాడు. జీన్‌పాల్ డుమినీ పరుగులేమీ చేయకుండానే నాటౌట్‌గా నిలిచాడు. ఇక కోల్‌కతా బౌలర్లలో పీయూష్ చావ్లా నాలుగు ఓవర్లలో 48 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. ప్రసిధ్ కృష్ణ నాలుగు ఓవర్లలో 41 పరుగులు, టామ్ కరణ్ మూడు ఓవర్లలో 33 పరుగులిచ్చి చెరో వికెట్ తీసుకున్నారు. అనంతరం ప్రత్యర్థి తమ ముందు ఉంచిన 211 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన కోల్‌కతా పరుగులు చేయలేక చతికిలపడింది. ఈ జట్టు 18.1 ఓవర్లలో కేవలం 108 పరుగులు చేసింది.
బ్యాట్స్‌మెన్‌లెవరూ ఆశించిన స్కోరును సాధించలేకపోయారు. ఓపెనర్ సునీల్ నరైన్ రెండు బంతులు ఎదుర్కొని ఒక బౌండరీతో నాలుగు పరుగులు చేసి మెక్‌క్లీన్‌గన్ బౌలింగ్‌లో కృణాల్ పాండ్యకు క్యాచ్ ఇచ్చాడు. క్రిస్ లీన్ 15 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, మరో మూడు బౌండరీల సహాయంతో 21 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. రాబిన్ ఉతప్ప 13 బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్లతో 14 పరుగులు చేసి మార్కండే బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. ఆండ్రూ రస్సెల్ నాలుగు బంతులు ఎదుర్కొని రెండు పరుగులు చేసి హార్థిక్ పాండ్య బౌలింగ్‌లో మార్కండేకు క్యాచ్ ఇచ్చాడు. వికెట్ కీపర్/కెప్టెన్ దినేష్ కార్తీక్ మూడు బంతులు ఎదుర్కొని ఒక బౌండరీతో ఐదు పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. నితీష్ రాణా 19 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, మరో రెండు ఫోర్లతో 21 పరుగులు చేసి హార్థిక్ పాండ్య బౌలింగ్‌లో బెన్ కటింగ్‌కు క్యాచ్ ఇచ్చాడు. రింకూ సింగ్ మూడు బంతులు ఎదుర్కొని ఒక బౌండరీతో ఐదు పరుగులు చేసి జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. పీయూష్ చావ్లా 13 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్‌తో 11 పరుగులు చేసి బెన్ కటింగ్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చాడు.
టామ్ కరణ్ 17 బంతులు ఎదుర్కొని మూడు బౌండరీలతో 18 పరుగులు చేసి కృణాల్ పాండ్య బౌలింగ్‌లో జీన్ పాల్ డుమినీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. కుల్దీప్ యాదవ్ 15 బంతులు ఎదుర్కొని ఐదు పరుగులు చేసి ఎల్‌బీడబ్ల్యూ అయ్యాడు. ప్రసిధ్ కృష్ణ ఐదు బంతులు ఎదుర్కొని ఒక పరుగు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ముంబయి బౌలర్లలో హార్థిక్ పాండ్య మూడు ఓవర్లలో 16 పరుగులు, కృణాల్ పాండ్య 3.1 ఓవర్లలో 12 పరుగులు ఇచ్చి రెండేసి వికెట్లు తీసుకున్నారు. మిచెల్ మెక్‌క్లీన్‌గన్, జస్ప్రీత్ బుమ్రా, మయాంక్ అగర్వాల్, బెన్ కటింగ్ తలో వికెట్ తీసుకున్నారు.