క్రీడాభూమి

ఎన్‌పీఎస్ కోచ్‌గా డారెన్ లీమన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, మే 9: ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు ఆటగాళ్లను సిద్ధం చేసే నేషనల్ పెర్ఫార్మెన్స్ స్క్వాడ్ (ఎన్‌పీఎస్) కోచ్‌గా జాతీయ మాజీ కోచ్ డారెన్ లీమన్ నియమితులయ్యాడు. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా ఉత్తర్వులు జారీ చేసింది. బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా ఆస్ట్రేలియా క్రికెట్ కోచ్ పదవి నుంచి తప్పుకున్న లీమన్‌కు తాజాగా కోచింగ్ బాధ్యతలు అప్పగించింది. అయితే బాల్ ట్యాంపరింగ్ వివాదంతో ఏడాది పాటు క్రికెట్‌కు దూరమైన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌తో పాటు 9 నెలల పాటు నిషేధం ఎదరుర్కొంటున్న బాన్‌క్రాఫ్ట్ చాలా మంచివాళ్లని లీమన్ తెలిపాడు. ఈ సందర్భంగా మాట్లాడిన లీమన్ మరోసారి బాల్ ట్యాంపరింగ్ వివాదంపై స్పందించాడు. స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌లకు మంచి భవిష్యత్తు ఉందని, వాళ్లు ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు ఆడి దేశ ప్రతిష్టను రెట్టింపు చేస్తారని చెప్పాడు, స్మిత్ మళ్లీ కెప్టెన్ అవుతాడని, అదృష్టవశాత్తూ అందరూ వారి తప్పుల్ని క్షమించేశారని లీమన్ పేర్కొన్నాడు. నేషనల్ పెర్ఫార్మెన్స్ స్క్వాడ్‌కు ట్రాయ్ కూలీ, ర్యాన్ హారిస్, క్రిస్ రోజర్స్‌లతో కలిసి లీమన్ సేవలందించనున్నాడు.