క్రీడాభూమి

ఢిల్లీకి చావోరేవో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 9: ప్రస్తుత ఐపీఎల్ 11వ సీజన్‌లోని మొత్తం ఎనిమిది జట్లలో చిట్టచివరి స్థానంలో ఉన్న ఢిల్లీ డేర్‌డెవిల్స్ గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్ కీలకం కానుంది. వాస్తవానికి ఈ మ్యాచ్ ఢిల్లీ భవితవ్యాన్ని తేల్చేదే. ఈ నేపథ్యంలో మనుగడ సాధించాలంటే ప్రత్యర్థితో జరిగే ఫైట్‌లో చావోరేవో తేల్చుకోవాల్సిన బాధ్యత శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని ఢిల్లీపై ఆధారపడి ఉంది. అయితే, ఏరకంగా చూసుకున్నా ఢిల్లీ కంటే సన్‌రైజర్స్ ఎంతో బలమైన జట్టుగా ఆవిర్భవించింది. ఐపీఎల్ మొత్తం జట్టలో తొలి స్థానంలో నిలిచిన హైదరాబాద్ ఇంతవరకు 10 మ్యాచ్‌లు ఆడగా వాటిలో ఎనిమిది మ్యాచ్‌లలో విజయం సాధించింది. కేవలం రెండు మ్యాచ్‌లలో ఓటమిని చవిచూసిన ఈ టీమ్ 16 పాయింట్లతో మిగిలిన అన్ని జట్ల కంటే అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక పాయింట్ల పట్టికలో కేవలం ఆరు పాయింట్లతో ఉన్న ఢిల్లీ ఇంతవరకు ఆడిన 10 మ్యాచ్‌లలో కేవలం మూడింట్లోనే విజయం సాధించింది. ఏడు మ్యాచ్‌లలో ఓటమిని చవిచూసిన ఈ టీమ్ మొత్తం జట్లలో ఆఖరి స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో ఐపీఎల్ ప్రారంభమైన నాటినుంచి ఈ రెండు జట్లు పరస్పరం తలపడింది ఇప్పటివరకు ఒకసారే. ఈనెల 5న హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఏడు వికెట్ల తేడాతో ఢిల్లీపై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ 19.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేయగా, ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. అంటే ఎంతో ఉత్కంఠగా జరిగిన ఈ పోరులో చివరకు విజయం సన్‌రైజర్స్‌నే వరించింది. వరుస వైఫల్యాలు, ఒత్తిడిని భరించలేక కెప్టెన్సీ బాధ్యతల నుంచి గౌతమ్ గంభీర్ స్వచ్ఛందంగా తప్పుకోవడంతో అతని స్థానే కొత్త బాధ్యతలు చేపట్టిన శ్రేయాస్ అయ్యర్‌కు గురువారం నాటి మ్యాచ్ చాలా ప్రతిష్టతో కూడుకున్నదని క్రీడాపండితులు వ్యాఖ్యానిస్తున్నారు. పృథ్వీ షా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 65 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో కీలక అలెక్స్ హేల్స్, యూసుఫ్ పఠాన్ వంటివారి కీలక క్యాచ్‌లను ఢిల్లీ జట్టు జారవిడుచుకోవడంతో మ్యాచ్‌ను చేతులా ప్రత్యర్థికి సమర్పించినట్లయింది. అదేవిధంగా 12 బంతుల్లో 27 పరుగులు చేయాల్సి ఉన్న తరుణంలో కూడా జరిగిన తప్పులను కెప్టెన్ అయ్యర్ అంగీకరించాడు. ఇలాంటి తప్పులు తమ తదుపరి మ్యాచ్‌లలో చేయబోమని, ఇటు బౌలింగ్, అటు బ్యాటింగ్‌లో చాలా ఆచితూచి ఆడతామని ఆయన స్పష్టం చేశాడు. గ్లెన్ మాక్స్‌వెల్, కొలిన్ మన్రో, పృథ్వీ షా వంటి బ్యాట్స్‌మెన్‌లు క్రీజులో ఎక్కువసేపు నిలబడితే పరుగుల వరద పారించే అవకాశం లేకపోలేదు. సన్‌రైజర్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో అమిత్ మిశ్రా తమ జట్టులోని పేసర్ల కంటే చాలా చక్కగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. గురువారం జరిగే మ్యాచ్‌లో తప్పకుండా విజయం సాధిస్తామనే ధీమాను ఆయన వ్యక్తం చేశాడు. ఇక సన్‌రైజర్స్‌లో అలెక్స్ హేల్స్, శిఖర్ ధావన్‌తోపాటు కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ బ్యాటింగ్ ఝళిపించడంతోపాటు గడిచిన మ్యాచ్‌లలో మాదిరిగానే బౌలర్లు భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్, షాకీబ్ అల్ హసన్, మహ్మద్ నబీ వంటివారు ప్రత్యర్థిని పరుగులు చేయకుండా నిరోధించగలిగితే ఇంకో గెలుపు వారి ఖాతాలో జమ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.