క్రీడాభూమి

ఐపీఎల్ మ్యాచ్ సమయాల్లో మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 9: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ 11వ సీజన్ విజయవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో లీగ్ దశలో మ్యాచ్‌లను మినహాయించి ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌ల సమయంలో మార్పులు చేస్తున్నట్లు ఐపీఎల్ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా ప్రకటించాడు. ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ఈనెల 20వ తేదీ వరకు లీగ్ మ్యాచ్‌లు పూర్తవుతాయి. మే 22న ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరుగుతుంది. అనంతరం 23న ఎలిమినేటర్, 25న రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లు కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతాయి. అయితే అభిమానుల సౌకర్యర్థం ఈ మ్యాచ్‌లను ముందుగా ప్రకటించిన విధంగా రాత్రి ఎనిమిది గంటలకు కాకుండా ఒక గంట ముందుగా అంటే రాత్రి ఏడుగంటల నుంచి మ్యాచ్‌లు ప్రారంభించాలని పాలకమండలి తీర్మానించింది. ఈ సందర్భంగా ఏపీఎల్ పాలక మండలి చైర్మన్ రాజీవ్ శుక్లా మాట్లాడుతూ గత పదేళ్లుగా అభిమానులు మైదానంలో కానీ, టీవీలలో విపరీతంగా చూస్తుంటారు కాబట్టి ఫ్యాన్స్ ఇష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌లను కాస్త త్వరగా ప్రారంభించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నాడు.
మ్యాచ్‌లు తిలకించిన అభిమానులు తిరిగి ఉదయం ఎవరి పనులకు వాళ్లు వెళ్లాడానికి కష్టమవుతుంది. మ్యాచ్‌లను తిలకించే వాళ్లలో అత్యధికంగా విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నారని, వారిని దృష్టిలో ఉంచుకుని మ్యాచ్‌ల వేళలు మార్చామని చెప్పాడు. దీంతో ఈ నిర్ణయం పట్ల క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైన ఈ నిర్ణయం ఎంతో ఉపయోగకారంగా ఉంటుందని శుక్లా వివరించాడు.