క్రీడాభూమి

ఇదేం నిర్ణయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* సెలక్టర్ల నిర్ణయం తప్పంటూ గంగూలీ వ్యాఖ్య
న్యూఢిల్లీ, మే 9: ఇంగ్లాండ్‌తో జరుగనున్న వనే్డ, టీ-20 క్రికెట్ సిరీస్‌కు అజింక్య రహానేకు స్థానం కల్పించకుండా అతనిని పక్కనపెట్టి అంబటి రాయుడుని ఎంపిక చేయడం పట్ల భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్‌లతో జరుగనున్న సిరీస్‌లకుగాను భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన విషయం విధితమే. ఎంతో అనుభవం ఉన్న అజింక్య రహానేను ఎంపిక చేయకుండా అంబటి రాయుడును జట్టులోకి తీసుకోవడం పట్ల సెలెక్టర్ల నిర్ణయాన్ని గంగూలీ తప్పబట్టాడు. ప్రస్తుతం అంబటి రాయుడు ఐపీఎల్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు జరిగిన పది మ్యాచ్‌ల్లో 423 పరుగులు సాధించి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. చెన్నై తరపున ఆడుతూ పరుగుల వేట సాగిస్తున్న రాయుడిని సెలెక్టర్లు టీమిండియా జట్టులోకి తిరిగి తీసుకున్నారు. ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ ఇంగ్లాండ్ పరిస్థితుల గురించి రహానేకు బాగా అనుభవం ఉందని, ఇలాంటి తరుణంలో నేనేతే అంబటి రాయుడిని పక్కనపెట్టి రహానేను జట్టులోకి తీసుకుంటానని తెలిపాడు. ఇంగ్లాండ్‌లో మంచి రికార్డు కలిగిన పరిమిత ఓవర్ల జట్టు నుంచి రహానేను తప్పించడం కఠినమైన నిర్ణయమన్నాడు. జూలై 3 నుంచి ఇంగ్లాండ్‌లో భారత పర్యటన ప్రారంభమవుతుంది. ఇక్కడ మొదట మూడు టీ-20 మ్యాచ్‌లు, తరువాత మూడు వనే్డ మ్యాచ్‌ల అనంతరం ఐదు టెస్టులను అక్కడ టీం ఇండియా జట్టు ఆడనుంది. అంతకుముందు జూన్ 14 నుంచి 18 వరకు బెంగళూరులో అఫ్గనిస్తాన్‌తో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడనుంది. జూన్ 27 నుంచి 29 వరకు ఐర్లాండ్‌తో రెండు టీ-20ల సిరీస్ కొనసాగుతుంది. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ మినహా మిగిలిన సిరీస్‌లకు సంబంధించిన జట్లను బీసీసీఐ సెలెక్టర్లు మంగళవారం ప్రకటించారు. ఐర్లాండ్, ఇంగ్లాండ్‌లో పర్యిటించనున్న వనే్డ, టీ-20 జట్టులోకి అంబటి రాయుడితో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ సిద్ధార్థ కౌల్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ యువ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కు సెలెక్టర్లు స్థానం కల్పించారు. అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్ట్‌కు కెప్టెన్‌గా రహానేను ఎంపికచేసిన సెలెక్టర్లు ఇంగ్లాండ్ పర్యటనకు మాత్రం అతనిని దూరం పెట్టారు. ‘నాకు అవకాశం ఇస్తే, రాయుడు కంటే ముందుగా రహానేను తీసుకుంటా.. విదేశాల్లో ఆడిన అనుభవం ఉన్న రహానేను జట్టు నుంచి తప్పించడం తగదు’ అని గంగూలీ అన్నాడు. కాగా, దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో పెద్దగా రాణించకపోయినా, అంతకుముందు సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో వరుసగా నాలుగు అర్థ సెంచరీలు చేసిన రహానేకు చోటు కల్పించకపోవడం సెలెక్షన్ కమిటీ తీసుకున్న తప్పుడు నిర్ణయంగా గంగూలీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఐపీఎల్ సన్‌రైజర్స్ తరపున సత్తా చాటుతున్న పేస్ బౌలర్ సిద్దార్థ్ కౌల్‌కు వనే్డ, టీ-20 జట్లలో స్థానం లభించడం విశేషం. విదేశాల్లో పర్యటించే జట్టుకు ఆటగాళ్లను ఎంపిక చేసే ముందు విదేశాల్లో వారు కనపరిచిన ప్రతిభను కూడా పరిగణలోకి తీసుకుని ఎంపికచేయాల్సి ఉంటుందన్నాడు.