క్రీడాభూమి

ఆసియా గేమ్స్‌లో పతకం సాధిస్తాం -- కామనెవల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్టు సత్తియన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 9: రానున్న ఆసియా గేమ్స్‌లో పతకం సాధిస్తామని ఆస్ట్రేలియా గోల్డ్ కోస్ట్‌లో ఇటీవల జరిగిన కామనె్వల్త్ గేమ్స్ టేబుల్ టెన్నిస్ విభాగం పురుషుల టీమ్‌కు గోల్డ్‌మెడల్ అందించిన జి.సత్తియన్ అన్నాడు. కామనె్వల్త్ గేమ్స్‌లో సాధించిన విజయంతో తమకు ఎంతో కలసి వచ్చిందని, త్వరలో ఇండోనేషియాలోని జకార్తాలో జరిగే ఆసియా గేమ్స్‌లో సైతం ఇదే ఆటతీరును ప్రదర్శించి పతకం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. అయితే, కామనె్వల్త్ గేమ్స్‌తో పోల్చుకుంటే ఆసియా గేమ్స్ చాలా భిన్నంగా ఉంటాయని, ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అగ్రశ్రేణి క్రీడాకారులు పాల్గొనబోతున్నందున పోటీ చాలా తీవ్రంగా ఉంటుందని ఆయన పేర్కొన్నాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో చైనాతో పోటీపడాలంటే కొంచెం కష్టంతో కూడుకున్నదని, అదే సమయంలో ఇటు జపాన్‌తోగానీ అటు కొరియాపై గానీ ఆధిపత్యం చెలాయించగలమని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. అయితే, భవిష్యత్తులో చైనాతో పోటీపడి పైచేయి సాధించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని, ఇందుకు శారీరకంగా, మానసికంగా సన్నద్ధమవుతామని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. తనకు చాలెంజ్‌లను సవాల్ చేయడమంటే చాలా ఇష్టమని, ఆ దిశగా దూసుకుపోవడం తన నైజమని ఆయన అన్నాడు.