క్రీడాభూమి

నేడు ఐర్లాండ్-పాక్ టెస్ట్ మ్యాచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డబ్లిన్, మే 10: మాలాహైడ్‌లో శుక్రవారం జరిగే ప్రా రంభ టెస్ట్ మ్యాచ్‌లో దిగ్గజ పాకిస్తాన్ జట్టుతో ఐర్లాండ్ జట్టు తలపడనుంది. పాకిస్తాన్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో తమకు పరాభవం తప్పదన్న సంగతి ఐర్లాండ్ కూనలకు తెలుసు. కానీ గతంలో పాక్‌ను మట్టి కరిపించిన చరిత్ర ఐర్లాండ్ టీమ్‌కు ఉంది. 2007 ప్రపంచకప్ పోటీల్లో పాకిస్తాన్‌పై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన చరిత్ర ఐర్లాండ్‌కు ఉంది. అప్పట్లో ఈ మ్యాచ్ కరీబియన్ దేశమైన జమైకాలో జరిగింది.అప్పుడు మ్యాచ్‌లో ఆడినవారిలో చాలా మంది ఇప్పుడు టీమ్‌లో సభ్యులుగా కొనసాగుతున్నారు. పాఠశాల టీచర్లు, రైతులు, పొస్ట్‌మెన్‌లతో కూడిన ఈ టీమ్ ఆసియన్ దిగ్గజాలైన పాక్ జట్టును మట్టి కరిపించడం అప్పట్లో గొప్ప సంచలనం సృష్టించింది. అదే రోజు సెం ట్ ప్యాట్రిక్స్ డే కావడం కూడా కలిసొచ్చింది. కాగా అప్పట్లో పాక్ జట్టుకు కోచ్‌గా మాజీ ఇంగ్లడ్ బ్యాట్స్‌మన్ బాబ్ వూల్మర్ వ్యవహరించేవాడు. ఇతగాడు, టెస్ట్ మ్యాచ్ ఆడే స్థాయిలేని దేశాల్లో క్రికెట్ ప్రమాణాలు పెంచడానికి తీవ్రంగా కృషి చేశాడు. అటువంటి వాడు, పాక్ పరాజయం పొందిన మరునాడు హోటల్ రూమ్‌లో విగతజీవుడై పడివుండటం గొప్ప విషాదాన్ని మిగిల్చింది.
నాటి మ్యాచ్‌లో పాకిస్తాన్ 132 పరుగులకే ఆలౌట్ అయింది. ఐర్లండ్ తరపున ఫాస్ట్ బౌలర్ బోయ్‌డ్ రాన్‌కిన్ మూడు వికెట్లు తీసి పాక్ వెన్ను విరిచాడు. ఇదిలావుండగా ఈ మ్యాచ్‌కు ముందు ఐర్లాండ్ జట్టు జింబాబ్వే జట్టుతో ఆడిన మ్యాచ్ టై గా ముగియడంతో, ఐర్లాండ్ అభిమానుల అంచనాలను ఈ జట్టు మించిపోయింది. కాగా ఐర్లాండ్ విజయోత్సాహం, వూల్మర్ మృతి విషాదం లో కొట్టుకుపోయింది. అప్పట్లో ఐర్లాండ్ విజయం ఒకవైపు, మరోవైపు భారత్, పాకిస్తాన్ జట్లు తొలిరౌండ్‌లోనే నిష్క్రమించడంతో, ఈ దేశాల అభిమానులపైనే ఆశలు పెట్టుకున్న ఆర్గనైజర్లున తీవ్ర నిరాశకు గురయ్యారు. క్రికెట్ ప్రసార హక్కులు పొందిన వారు పెద్ద మొత్తంలో నష్టపోయారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితి ఉత్పన్నం కాకూడదని గట్టిగా నిర్ణయించింది. దీనివల్లనే వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో జరిగే ప్రపంచ కప్ పోటీల్లో పాల్గొనే జట్ల సంఖ్యను 10కి కుదించారు.