క్రీడాభూమి

నేషనల్ క్యాంప్‌కు 30మంది క్రీడాకారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే10: జాతీయ ఫూట్‌బాల్ కోచ్ స్టీఫెన్ కాన్‌స్టాంటైన్, 30 మంది ఫూట్‌బాల్ క్రీడాకారులను ప్రిపరేటరీ క్యాంప్‌కు రావాల్సిందిగా ఆదేశించారు. జూన్ 1 నుంచి ముంబయి లో జరుగనున్న హీరో ఇంటర్ కాంటినెంటల్ కప్ నేపథ్యంలో క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడమే ఈ పిలుపునకు కారణమని తెలుస్తోంది. మే 16లోపు క్రీడాకారులు క్యాంప్‌కు రావాలని స్టీఫెన్‌సన్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. అయి తే జెఎస్‌డబ్ల్యు బెంగళూరు ఎఫ్‌సీ క్రీడాకారు లు మత్రం ఈ నెల 18న రిపోర్టు చేయనున్నా రు. కాగా ఈ మ్యాచ్‌ల్లో కెన్యా, న్యూజిలాండ్, చైనా-తైపీ దేశాలతో భారత్ తలపడుతుంది. ఈ పోటీలు 2019లో యుఏఈలో జరిగే ఏఎఫ్‌సీ ఆసియన్ కప్ పోటీలకు సంసిద్ధం కావడానికి ఉపయోగపడతాయి. న్యూజిలాండ్ బ లమైన జట్టని స్టీఫెన్ కాన్‌స్టెంటైన్ వెల్లడించారు.

అగ్రస్థానంలోనే నాదల్, జొకొవిచ్‌లు
మాడ్రిడ్, మే 10: రఫెల్ నాదల్, నోవాక్ జొకొవిచ్‌లు టెన్నిస్‌లో ఇప్పటికీ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోనున్నారు. మాడ్రిడ్ ఓపెన్‌లో బ్రిటన్‌కు చంది కైలే ఎడ్మండ్ చేతిలో జొకొవిక్ పరాజయం పాలైనా అతని స్థానానికి ఢోకాలేదు.
బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్‌కు చెందిన గేయిల్ మొనిఫిల్స్‌ను 6-3, 6-1 స్కోరు తేడాతో నాదల్ ఓడించాడు. ఇదే సమయంలో జొకొవిక్ ప్రపంచ 22వ నెంబరు ఆటగాడు ఎడ్మండ్ చేతిలో 6-3, 2-6, 6-3 తేడాతో పరాజయం పాలుకావడం విచిత్రం. ఇక మహిళల ఈవెంట్‌లోన టాప్ సీడ్, డిపెండింగ్ ఛాంపియన్ సిమోనా హలెప్, మాజీ ప్రపంచ నెంబర్ వన్ మారిన షరపోవాలు విజయం సాధించారు. రెండో సీడ్ కరోలైన్ ఒజ్నియాస్కీ, మూడో సీడ్ గార్బైన్ ముగురుజలు ఇద్దరూ ఆశ్చకరమైన రీతిలో పరాజయం పాలయ్యారు. ఎడ్మండ్ చేతిలో జొకొవిక్ పరాజయానికి, అతను ఇంకా మోచేతి ఆపరేషన్ నుంచి పూర్తిగా కోలుకోకపోవడమే కారణమని చెబుతున్నారు. ఈ నెల చివరిలో జరుగనున్న ఫ్రెంచ్ ఓపెన్ పోటీలు జరుగనుండగా, ప్రస్తుత పోటీలనుంచి త్వరగానే నిష్క్రమించాల్సి రావడం జొకొవిచ్‌కు మింగుడుపడని అంశమే.