క్రీడాభూమి

గెలిస్తేనే నిలబడేది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ైపూర్, మే 10: ఇప్పటివరకు వరుస పరాజయాలతో కునారిల్లుతున్న రాజస్థాన్ రాయల్స్, శుక్రవారం దిగ్గజ చెన్నై సూపర్ కింగ్స్‌ను ఢీకొనబోతున్నది. అత్యధిక పరాజయాలు మూటకట్టుకున్న రాజస్థాన్ రాయల్స్‌కు ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. నిజానికి మూడు వరుస పరాజయాలతో దాదాపు ఈ ఐపీఎల్‌లో అవకాశాలు దాదాపు మూసుకుపోయిన స్థితిలో, గత మ్యాచ్‌లో కింగ్స్11 పంజాబ్ జట్టుపై 15 పరుగుల తేడాతో విజయం సాధించడంతో టోర్నమెంట్‌లో ఆశలు సజీవంగా నిలుపుకుంది. ఇంకా ఆడాల్సిన మ్యాచ్‌లు నాలుగు ఉన్నాయి. ప్రతి మ్యాచ్‌లోను పరిస్థితులు అనుకూలిస్తేనే రాయల్స్ ఐపీఎల్‌లో నిలబడగలుగుతుంది. అంటే ప్రతి మ్యాచ్‌లో తన పనితీరును ఎప్పటికప్పుడు మరింత మెరుగు పరచుకుంటూ ముందుకు సాగక తప్పదు. పూణెలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో 64 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. రేపటి మ్యాచ్‌లో రాయల్స్ ఈ ఓటమికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం లభించింది. ఈ ఐపీఎల్ సీజన్ రాజస్థాన్ రాయల్స్‌కు అనుకూలంగా లేదు. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 8 పాయింట్లు మాత్రమే సాధించి ఆరోస్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఆజింక్యా రెహానే నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ జట్టు గెలిస్తేనే ప్లేఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఒక వేళ ఓడిపోతే జట్టుకు అవకాశాలన్నీ మూసుకొని పోయినట్లే. బ్యాట్స్‌మెన్, బౌలర్ల ఆటతీరు దారుణంగా ఉండటం ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు పెద్ద విఘాతమైం ది. గత మ్యాచ్‌లో ఇంగ్లండ్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ అయిన జాస్ బట్లర్ 58 బంతుల్లో 82 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. ఇతగాడి ఆటవల్ల జట్టు 158 పరుగులు సాధించగలిగింది. కాగా జట్టులోని కృష్ణప్ప, గౌతమ్, కీవీ స్పిన్నర్ ఇష్ సోధీ, జోఫ్రా ఆర్చర్‌లు ఉత్తమ బౌలింగ్ ప్రదర్శనతో జట్టును ఆదుకున్నారు.
ఇక చెన్నై సూపర్ కింగ్స్ మొత్తం 10 మ్యాచ్‌ల్లో 14 పాయింట్లు సాధించి బలీయమైన స్థితిలో ఉంది. ప్లే-ఆఫ్‌ల్లో స్థానం సంపాదించడానికి ఈ పాయింట్లు చాలు. రెండేళ్ల పాటు సస్పెన్షన్‌ను ఎదుర్కొన్న చెన్నై సూపర్ కింగ్స్ మహేంద్రసింగ్ ధోనీ నేతృత్వంలో ఈ సీజన్‌లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శిస్తోంది. ఈ టీమ్‌లో బ్యాట్స్‌మెన్ మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ బౌలింగ్ బలహీనత జట్టును పీడిస్తోంది. అయితే రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరుతో ఆడిన గత మ్యాచ్‌లో సీఎస్‌కే బౌలర్లు మంచి ప్రదర్శన ఇవ్వడం గమనార్హం. మే 5న జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 9 వికెట్లకు 127 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని సీఎస్‌కే ఆరువికెట్లు ఇంకా చేతిలో ఉండగానే అవలీలగా ఛేదించింది. ఎడమచేతి స్పిన్నర్ రవీంద్ర జడేజా (3/18), వెటరన్ హర్‌భజన్ సింగ్ (2/22)లు ఆర్‌సీబీపై విజయానికి బాటలు వేశారు. అయితే పేసర్ల త్రయం, లుంగి గిడి, డేవిల్ విల్లీ, శార్దూల్ ఠాకూర్‌లు, మరింత బాధ్యతాయుతంగా ఆడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా దీపక్ ఛహర్ గాయపడి విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో వీరిపై అదనపు బాధ్యత పడింది. ఇక బ్యాట్స్‌మెన్ విషయంలో చెన్నై సూపర్ కింగ్స్‌కు తిరుగేలేదు. అంబటి రాయుడు, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ షానే వాట్సన్, వెస్ట్ ఇండీస్ ఆటగాడు డ్వాయ్‌నే బ్రేవో, స్కిప్పర్ ధోనీలు అవసరమైన సమయాల్లో విజృంభించి జట్టుకు అండగా నిలబడుతున్నారు. ముఖ్యంగా అంబటి రాయుడు, ఓపెనర్‌గాను, నాలుగో స్థానంలోను అద్భుతంగా రాణించాడు. ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్‌లో అతడి స్కోరు 423 పరుగులు. ఇక థోనీ గత మ్యాచ్‌ల్లో మాదిరిగా సిక్స్‌లు కొట్టడంలేదని, సరైన ఆటతీరు ప్రదర్శించడం లేదని విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో 360 పరుగులు చేసి ఏడో స్థానంలో నిలిచాడు. ఇందులో మూడు అర్థ సెంచరీలు, ఒక 79 నాటౌట్ ఉన్నాయి.
ప్రి క్వార్టర్స్‌లోకి సాయిప్రణీత్, సమీర్ వర్మ
సిడ్నీ, మే 10: భారత షట్లర్స్ బీ.సాయిప్రణీత్, సమీర్ వర్మలు అద్భుతమైన ఆటతీరును ప్రధర్శించి ప్రత్యర్థులపై విజయం సాధించి ఇక్కడ జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌కు ప్రవేశించారు. రెండో రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో ద్వితీయ సీడ్ ఆటగాడు సాయి ప్రణీత్ 21-12, 21-14 స్కోరు తేడాతో ప్రత్యర్థి ఇండోనేసియాకు చెందిన అహ్మద్ వౌలానాపై, మరో మ్యాచ్‌లో నాలుగో సీడ్ సమీర్ వర్మ 21-16, 21-12 స్కోరు తేడాతో జపాన్‌కు చెందిన టకుమ ఉయోదాపై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. క్వార్టర్ ఫైనల్లో జరిగే మ్యాచ్‌లో ప్రణీత్ ఏడో సీడ్ ఆటగాడు ఇండోనేసియాకు చెందిన లీ చెక్ యూతో, సమీర్ చైనాకు చెందిన లూ గువాంజుతో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో తలపడనున్నాడు. భారత ఆటగాళ్లకు ఈ రోజు కలిసివచ్చింది. పురుషుల డబుల్స్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు తృతీయ సీడ్ మనుఅత్రి, బీ.సుమీత్‌రెడ్డిల జోడీ 21-17, 21-17 స్కోరు తేడాతో కోరియాకు చెందిన హైయుక్ గైన్‌చోయ్, కాయుంగ్ హున్ పార్క్‌పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్ పోటీలో ప్రణీత్ 21-17, 21-14 తేడాతో ఇజ్రాయిల్‌కు చెందిన మిషన్ జిల్‌బెర్మన్‌పై, సమీర్ వర్మ 13-21, 21-17, 21-12 తేడాతో న్యూజిలాండ్‌కు చెందిన అభినవ్‌పై నెగ్గాడు. సౌరభ్ వర్మ 21-19, 17-21, 12-21 తేడాతో జపాన్‌కు చెందిన టకుమా ఉయోదా చైతీలో, రాహుల్ యాదవ్ 20-22, 21-13, 19-21 తేడాతో హాంకాంగ్‌కు చెందిన వౌలానా చేతిలో ఓడిపోయారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ పోటీలో తెలుగు అమ్మాయి జక్కా వైష్ణవి రెడ్డి 19-21, 21-15, 21-15 స్కోరు తేడాతో ఇంగ్లాండ్‌కు చెందిన జార్జినా బ్లాండ్‌పై విజయం సాధించింది.
సాయి ఉత్తేజిత 8-21, 19=21 స్కోరు తేడాతో జపాన్‌కు చెందిన మినె చేతీలో ఓటమి పాలుకాగా, శ్రీకృష్ణ ప్రియ 18-21, 20-22 స్కోరు తేడాతో ఇండోనేసియాకు చెందిన యూలియా చేతిలో ఓడిపోయింది.

పరుగుల వరద
ఫిరోజ్ షా కోట్ల మైదానం పరుగుల వరదతో మార్మోగింది! బౌండరీల సునామీలతో బ్యాట్స్‌మెన్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ప్రేక్షకులకు కనువిందు చేయడంతో పాటు, ఎన్నో రికార్డులకు ఈ మ్యాచ్ వేదికగా నిలిచింది! ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ 187 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్ మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే తొమ్మది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సన్‌రైజర్స్ సగర్వంగా ప్లే ఆఫ్‌కు చేరుకుంది.