క్రీడాభూమి

20 నుంచి బీఎఫ్‌డబ్ల్యూ థామస్, ఉబెర్ కప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 10: బ్యాంకాక్‌లో ఈనెల 20వ తేదీ నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్న ప్రపంచ బాడ్మింటన్ సమాఖ్య (బీఎఫ్‌డబ్ల్యూ) థామస్, ఉబెర్ కప్‌లలో పాల్గొనే భారత మహిళల జట్టుకు సైనా నెహ్వాల్, పురుషుల జట్టుకు హెచ్.ఎస్.ప్రణయ్ నాయకత్వం వహించనున్నారు. ఈ విషయాన్ని బా డ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండి యా వెల్లడించింది. ఆసియా చాంపియన్‌షిప్ లో రజత పతకం సాధించిన ప్రణయ్‌తో పాటు వరల్డ్ నెంబర్ 18 షట్లర్ బి.సాయి ప్రణీత్, సమీర్ వర్మ, జూనియర్ వరల్డ్ నెంబర్ 4 షట్లర్ లక్షయ్ సేన్ పురుషుల సింగిల్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో పా ల్గొంటారు. ఇక మహిళల విభాగంలో ఇటీవల ఆస్ట్రేలియా గోల్డ్ కోస్ట్‌లో గోల్డ్ మెడల్ సాధించిన షట్లర్ సైనా నెహ్వా ల్‌తో పాటు వైష్ణవి జక్కారెడ్డి, సాయి కృష్ణప్రియ, అనురా ప్రభు, వైష్ణవి భాలే ఉబెర్ కప్ సింగిల్ పోటీల్లో పాలుపం చుకుంటారు. థామస్ కప్ డబుల్స్ కేటగిరిలో సీని యర్ షట్లర్ల ద్వయం సు మీత్ రెడ్డి, మను అత్రితోపాటు వరల్డ్ నెంబర్ 43 ష్లోక్ రామచంద్రన్, ఎం. ఆర్.అర్జున, ఇండియ న్ నెంబర్ వన్ ర్యాంక్ ద్వయం సన్యామ్ శుక్లా, అరుణ్ జార్జ్ పాల్గొంటారు. జే.మేఘన, పూర్వి షా రామ్, ప్రజాక్తా సావంత్, సాన్యోగితా ఘోర్పడే ఉబెర్ కప్ డబుల్స్‌లో పాల్గొం టారు. ఈ సందర్భంగా బాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) ప్రెసిడెంట్ హిమంతా బిస్వా శర్మ మా ట్లాడుతూ ఇలాంటి పోటీల్లో యువకు లకు అవకాశాలు ఇవ్వడం వల్ల వారు ఈ రంగంలో అనువజ్ఞులైన క్రీడాకారుల నుంచి ఎన్నో మెలకువలను నేర్చుకోవడా నికి దోహదపడుతుందని అన్నారు. సీని యర్ క్రీడాకారులతో కలసి పనిచేయడం వల్ల ఎన్నో అనుభూతులను చవిచూడవ చ్చునని పేర్కొన్నారు. థామస్, ఉబెర్ కప్‌లలో పాల్గొనే క్రీడాకారుల ఎంపిక గతంలో వారు చూపిన ప్రతిభ ఆధా రంగానే జరిగిందని తెలిపారు. కాగా, భారత జట్లు తొలి మ్యాచ్‌ను ఫ్రాన్స్‌తో ఆడుతుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా, చైనా, కెనడా, జపాన్ జట్లతో తలప డతాయి.